Bandal Ganesh : అయ్యో బండ్ల అన్న… త్రివిక్రమ్ కూడా కనిపించకుండా చేశావ్ కదే
Bandal Ganesh : అంతా ఊహించిందే జరిగింది. బండ్ల గణేష్ భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి ఆయనకు ఆహ్వానం అందలేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో బండ్ల గణేష్ ఫోన్ కాల్ మాటలు నిజమే అని… అవి ఆయన సొంత మాటలు అని క్లారిటీ వచ్చేసింది అంటూ చర్చ మొదలైంది. బండ్ల గణేష్ మరియు త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని కూడా క్లారిటీగా తేలిపోయింది అని పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. బండ్ల గణేష్ ని ఆహ్వానిస్తే తాను హైలైట్ కాలేక పోతున్నాను అంటూ త్రివిక్రమ్ భావిస్తున్నట్లుగా ఆ ఫోన్ కాల్ సంభాషణ సారాంశం. బండ్ల గణేష్ ఆ ఫోన్ కాల్ లో అన్నది నిజమే అయి ఉంటుందని ఇప్పుడు పవన్ అభిమానులు మరింత నమ్మకానికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ లేకపోవడం చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఆయన లేని లోటు కనిపించింది అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ ఉంటే ఆ జోష్ వేరు ఉండేది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో కేవలం బండ్ల గణేష్ మాత్రమే కాకుండా త్రివిక్రమ్ కూడా సందడి చేయలేక పోయాడు. కార్యక్రమానికి హాజరైన త్రివిక్రమ్ కూడా కనిపించకుండా వెనక ఉండి పోయాడు. ఒకటి రెండు సార్లు కెమెరా కంటికి కనపడ్డా మాట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కేవలం బండ్ల గణేష్ మాటల వల్లే త్రివిక్రమ్ వెనక్కు వెళ్ళి పోయాడు అంటూ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

bandal ganesh leaked phone call trivikram not give speech in bheemla nayak pre release event
బండ్ల గణేష్ అలా మాట్లాడి ఉండక పోతే నిన్నటి కార్యక్రమం లో త్రివిక్రమ్ సుదీర్ఘమైన స్పీచ్ ను వినే అవకాశం పవన్ అభిమానులకు దక్కేది. పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ తన మాటలు చెప్తూ ఉంటే అభిమానులు అలా నోరెల్ల బెట్టి వింటూ ఉండడం గతంలో ఎన్నో సార్లు జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. కాని బండ్ల గణేష్ ఆడియో లీక్ వల్ల త్రివిక్రమ్ తన స్పీచ్ ఇవ్వలేదు. బండ్ల గణేష్ లీక్ అయినా ఫోన్ కాల్ వ్యవహారం కారణంగానే ఆయన షో కి దూరం కావడమే కాకుండా.. త్రివిక్రమ్ కూడా కార్యక్రమంలో మాట్లాడకుండా చేశాడు. త్రివిక్రమ్ తదుపరి సినిమా కైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడేమో కానీ ఇకపై బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ కాంపౌండ్ లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.