Bigg Boss OTT Telugu : త్వరలో ‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Bigg Boss OTT Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన నాటి నుంచి నెక్స్ట్ సీజన్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ సీజన్ ‘ఓటీటీ ’ వర్షన్ అని అప్పట్లో వార్తలు రాగా, అది కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ షోకు కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జుననే హోస్ట్ కాగా, త్వరలో ఈ షో స్టార్ట్ కానుంది.ఈ ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ షో 24 హవర్స్ టెలికాస్ట్ కానుంది. దాదాపు 82 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సమాచారం. ఇకపోతే ఈ షోలో కంటెస్టెంట్స్ గా వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి పర్సన్స్ ను సెలక్ట్ చేసినట్లు టాక్. కాగా, వచ్చే నెల చివరిలో వారంలో షో స్టార్ట్ కానుందని వినికిడి.
సీజన్ ఫైవ్ విన్నర్ గా వీజీ సన్నీ టైటిల్ గెలుచుకోగా, రన్నర్ గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచిన సంగతి అందరికీ విదితమే.ఇప్పటికే సోషల్ మీడియాలో ‘బిగ్ బాస్’ ఓటీటీ కంటెస్టెంట్స్ పైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. పలువురిని సెలక్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ ఓటీటీ వర్షన్ లో కంటెస్టెంట్స్ కు ఇవ్వబోయే టాస్కులు, వారికి పెట్టే పరీక్షలు చాలా కొత్తగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్.ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం..
Bigg Boss OTT Telugu : కంప్లీట్ ప్లాన్ రెడీ..!
జబర్దస్త్ యాంకర్ వర్షిణి, యూట్యూబర్ యాంకర్ శివ కంటెస్టెంట్స్‌గా ఫైనల్ అయ్యారట. టిక్ టాక్ తో ఫేమస్ అయిన ‘ఉప్పల్’ బాలు, ప్రముఖ యూట్యూబర్ ఒకరు కూడా సెలక్ట్ అయినట్లు టాక్. ఈ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నిర్వాహణను ఫేమస్ యాంకర్ ఓంకార్ నిర్మాణ సంస్థ ‘ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్’కు అప్పజెప్పారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ షోకు యాంకర్‌గా నాగార్జున వ్యవహరిస్తూ నిర్వహణ బాధ్యతలు ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ కు ఇస్తారా? అనే ప్రశ్నలు కూడా ఎదురవతున్నాయి. నిర్వహణ విషయమై ఇప్పటివరకు ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.