childhood : దోస్త్ మేరా దోస్త్… ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఒకప్పటి ఫ్రెండ్స్ అని మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

childhood : దోస్త్ మేరా దోస్త్… ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఒకప్పటి ఫ్రెండ్స్ అని మీకు తెలుసా..?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2021,10:20 am

childhood : స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడో సినీ రచయిత. ఆస్తులు, అంతస్థులెన్ని ఉన్నా ఓ మంచి మిత్రుడు ఉండాలని అంటారు. అదీ స్నేహానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడున్న టాలీవుడ్‌ టాప్ సెలబ్రిటీలలో ఒకప్పటి చిన్ననాటి స్నేహితులతో పాటు.. ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చే స్నేహితులు చాలామందే ఉన్నారని మీలో ఎంత మందికి తెలుసు. తెలీదా.. అయితే రండి వారిపై మనమూ ఓ లుక్కేద్దాం.దోస్త్ మేరా దోస్త్… ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఒకప్పటి ఫ్రెండ్స్ అని మీకు తెలుసా..?

1. సాయి ధరమ్‌ తేజ్‌ – నవీన్‌ విజయ్‌కృష్ణ

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌, సీనియర్ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఎవరి సినిమాలతో వారు ఎంత బిజీగా ఉన్నా .. ఏ టూర్ కు వెళ్ళినా ఏ షాపింగ్ కు వెళ్ళినా ఇప్పటికీ ఇద్దరూ కలిసే వెళ్తారు. ఒకరికొకరు అండగా ఉంటారు.

2. రామ్‌ చ‌ర‌ణ్ – శ‌ర్వానంద్‌:

మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌, నటుడు శ‌ర్వానంద్‌, ద‌గ్గుబాటి రానా క‌లిసి చిన్నపుడు ఒకే స్కూల్లో చ‌దువుకున్నారట. అయితే అనుకోనో అనుకొకనో ఇప్పుడు వీరు ముగ్గురు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా రాణిస్తున్నారు. మంచి హిట్లతో దూసుకెళ్తున్నారు.

childhood friends in tollywood heros

childhood friends in tollywood heros

3. నాని – యాంకర్ ప్ర‌దీప్‌:

టాలీవుడ్ యంగ్, అండ్ నాచురల్ స్టార్ నాని, టాప్ మేల్ యాంక‌ర్ ప్ర‌దీప్ లు కూడా ఇద్దరూ చిన్న నాటి మిత్రులే. వీరిద్దరూ కలిసి హైద‌రాబాద్‌లోని సెంట్ అల్పోన్సా పాఠ‌శాల‌లో ఓకే తరగతిలో కలిసి చ‌దువుకున్నార‌ట‌. హీరో నానియే స్వ‌యంగా ఓ టీవి షో లో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

4. కృష్ణ – ముర‌ళీ మోహ‌న్ :

సూపర్ స్టార్ కృష్ణ, సీనియ‌ర్ నటుడు ముర‌ళీ మోహ‌న్‌ లు కూడా ఓకే కాలేజీలో చదువుకున్నారంటా. ఏపిలోని ఏలూరు సీ ఆర్ రెడ్డి కాలేజీలో ఇద్దరూ ఓకే బెంచీ పై కూర్చొని పాఠాలు విన్నారంట. ఆ తర్వాత అనుకోకుండా సినీ రంగం లోకి వచ్చిన వీరిద్దరూ స్టార్ హీరోలు కొనసాగారు. కృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుండగా.. మురళి మోహన్ మోహన్ మాత్రం సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.

5- సల్మాన్ ఖాన్ – అమీర్ ఖాన్:

టాలీవుడ్ లోనే కాకుండా బాలివుడ్ లో సైతం ఇలాంటి చిన్న నాటి మిత్రులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖులైన సల్మాన్ ఖాన్ – అమీర్ ఖాన్ ఇద్దరూ చిన్న నాడు ఓకే స్కూల్ లో ఒకే తరగతి లో కలిసి చ‌దువుకున్నారట. అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరూ.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా పేరొందిన హీరోలుగా కొనసాగుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది