NTR ANR : దాన వీర శూర కర్ణలో సినిమాలో ANRకు ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారట.. ఎందుకంటే..?
NTR ANR : నందమూరి తారకరామారవును తెలుగు ప్రేక్షకులకు దేవుడి రూపంలో కొలుస్తారనడంలో అతిశయోక్తి లేదు. అప్పటివరకు రాముడు, కృష్ణుడు ఎలాగ ఉంటారో తెలియని వారి వెండితెరపై ఇలాగే ఉంటారని చూపించారు సీనియర్ ఎన్టీఆర్. పౌరాణిక చిత్రాల్లో ప్రతీ రోల్ ఎన్టీఆర్ పోషించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. కొందరైతే దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఏకంగా ఆయన చిత్ర పటాలను ఇంట్లో పెట్టకుని పూజించే వారంటే అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ ఎంతటి మహానుభావుడో..ఎన్టీఆర్ నటుడు గానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శక నిర్మాతగాను వ్యవహరించారు.
ఆయన స్వీయ దర్శకత్వంతో పాటు నటించిన సినిమా ఏదంటే 1977లో వచ్చిన ‘దాన వీర శూర కర్ణ’.. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించారు. కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు.. ఈ సినిమా విడుదలయ్యాక పెనుసంచలనం సృష్టించింది. అదే టైంకు సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వగా కృష్ణ నటించిన సినిమా ప్లాఫ్ అయ్యింది. అయితే, ఈ సినిమా అప్పట్లో రూ.10లక్షలు పెట్టి తీస్తే ఏకంగా కోటి కలెక్షన్ సాధించినట్టు సినిమా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మళ్లీ ఇదే సినిమాను 1994లో థియేటర్లలో విడుదల చేయగా అప్పుడు కూడా జనం ఎగబడి మరీ సినిమాకు వచ్చినట్టు తెలిసింది. అప్పట్లో ఎన్టీయార్ సినిమాలు అంటే జనాలు ప్రాణాలు ఇచ్చేవారని తెలిసిందే.. అంత అభిమానం ఉండేది.
NTR ANR : అక్కినేని ఎందుకు ఒప్పుకోలేదంటే..
దాన వీర శూర కర్ణ సినిమాలో దర్శకుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్‌ను ఈ మూవీలో నటించాలని కోరారట.. ఆయన కోసం కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలు ఇచ్చారట.. అయితే, అంతకుముందు వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్‌ను ప్రజలు కృష్ణుడిగా చూశారు. మళ్లీ నేను చేస్తే ప్రజలు నన్ను అంగీకరించరని చెప్పాడట.. ఇక కర్ణుడి పాత్ర చేయాలని చెప్పగా.. పాండవులు తనకు మరుగుజ్జులుగా కనిపిస్తారని దీనికి నేను న్యాయం చేయలేనని బదులిచ్చారట..