Guppedantha Manasu 05 August 2022 Episode : దేవయాని వలలో చికుకున్న రిషి.. నా బిడ్డతో అడుకోవద్దని అర్థించిన జగతి..
Guppedantha Manasu 05 August 2022 Episode : వసుధరా కార్ రిపేరు చేస్తున్నారు.. నీకు నిద్ర వస్తుంటే వెళ్లి కార్లో పడుకో అని రిషి చెపుతాడు.. సర్ ఇలా చలిమంట వేసి ఉంటే ఎలా నిద్రపోతాను సార్ ఈ క్షణాలన్నింటినీ ఆస్వాదిస్తాను అని వసుధారా అంటుంది.. ప్రతి క్షణాలను ఇలానే బంధిస్తావా వసుధారా అని రిషి అంటాడు.. నాకు నచ్చినవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటాను సార్ మిమ్మల్ని మాత్రం జ్ఞాపకంలా కాకుండా జీవితాంతం నా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది.. వసుధార నిన్ను ఒక విషయం అడుగుతాను సూటిగా స్పష్టంగా చెబుతావా అని రిషి అంటాడు.. వసుధార ఈ చల్లి మంటను మనం ఆస్వాదిస్తే ఆనందంగా ఉంటుంది.. అదే మనం చిరాకుగా ఉంటే మన గుండె మంట లాగా అనిపిస్తుంది కదా అని అంటాడు.. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు సార్ అని వసుధారా అంటుంది.
నేను ఇచ్చిన గిఫ్ట్ని నా కళ్ళముందే పగిలిపోయి ముక్కలైన గిఫ్ట్ని మళ్ళీ నాకే ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించింది అని రిషి అడుగుతాడు.. కాదనుకున్నావు.. నేలకు విసిరి కొట్టిన దానిని మళ్లీ ఎందుకు అతికించావు.. అసలు ఏమి జరగనట్టు ఎలా ఉంటాన్నవు.. కానీ నేను నాకులగనే ఉంటాను.. నువ్వు చెప్పింది నిజమే వసుధార.. సర్ ఈ టాపిక్ గురించి ఇప్పుడు వదిలేద్దాం అని అంటుంది. అంతలో మెకానిక్ కార్ రిపేర్ అయిందని చెబుతాడు.. వసుధర రిషి మొబైల్, పరుసు తీసుకొని వచ్చి ఇస్తుంది.. అప్పటికే రిషికి వాళ్ళ పెద్దమ్మ చాలా సార్లు కాల్ చేసినట్లు ఉంటుంది.. వెంటనే వాళ్ళ పెద్దమ్మ కి రిషి ఫోన్ చేసి మాట్లాడుతడు. పెద్దమ్మ ఏమైంది ఎన్నిసార్లు కాల్ చేసావు అని రిషి అనగానే.. నిన్ను చూడకుండానే నేను చనిపోతానేమో రిషి.. నువ్వు అర్జెంటుగా ఎక్కడ ఉన్నా ఇంటికి రా అని వాళ్ళ పెద్దమ్మ చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది.. దేవయాని ధరణిని పిలిచి నాకు ఆకలేస్తుంది తినటానికి ఏమైనా తీసుకురమ్మని చెబుతుంది.
ఫ్రూట్స్ తినేసిన తర్వాత జగతి ఒక ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది.. అక్కయ్య నా కొడుకు ఆనందం కోసం ఏదైనా చేస్తాను.. ఇప్పుడు రిషి వస్తాడు.. నేను ఏం చెబితే అది చేస్తాడు… రిషి నా ఆయుధం.. సాక్షి నీ ఈ ఇంటి కోడలు చేస్తాను.. రిషి నా ప్రాపర్టీ జగతి.. ఈ ఇంటికి వచ్చే కోడలు కూడా నా మాటే వినాలి.. ఏంటి జగతి సరెండర్ అయిపోతున్నవా అని దేవయాని అడుగుతుంది.. నా బిడ్డ సంతోషాన్ని దూరం చేయకు అక్కయ్య అని జగతి అడుగుతుంది. అలాంటివి కుదరవు అని దేవయాని అంటుంది.. వసుధర ను తీసుకొని రిషి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వస్తాడు వదిన పెద్దమ్మ ఎక్కడ అని అడుగుతాడు.. రిషి ఇప్పుడే అత్తయ్య గారు తన గదిలోకి వెళ్ళారు అని ధరణి చెబుతుంది.. పెద్దమ్మ ఏమైంది మీకు .. ఫోన్ లో ఆ మాటలు ఏంటి.. పెద్దమ్మ ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా అంటాడు.. లేదు రిషి నేను సాక్షి విషయంలో పొరపాటు చేశాను అని దేవయాని అంటుంది..