Indraja : ఎవరి దిష్టి తగిలిందో.. మాకు ఇలా అయింది.. ఇంద్రజ కంటతడి
Indraja : బుల్లితెరపై ఇంద్రజకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రోజా స్థాయిలో మరెవ్వరూ కూడా బుల్లితెరపై ఆదరణ సంపాదించుకోలేరని అంతా అనుకునేవారు. జబర్దస్త్ షోలో జడ్జ్‌గా రోజా తప్పా ఇంకెవ్వరూ సూట్ అవ్వలేరని భావించేవారు. కానీ ఇంద్రజ వచ్చి ఆ అనుమానాలన్నింటినీ పటా పంచెలు చేసింది. తాను జడ్జ్‌గా వంద శాతం న్యాయం చేయగలను అని నిరూపించుకుంది. అలా గెస్టుగా మొదలైన తన ప్రయాణం జడ్జ్‌గా స్థిర పడింది.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లోనూ ఇంద్రజే కనిపిస్తుంది. ఇప్పుడు బుల్లితెరపై ఇంద్రజ ఓ వెలుగు వెలిగిపోతోంది. బుల్లితెరపై ఇంద్రజ డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. అయితే ఇంద్రజకు క్లోజ్ అయింది మాత్రం సుధీర్ ఒక్కడే. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ద్వారా ఈ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తల్లిలా ఇంద్రజను సుధీర్ చూడటం, ఆ తల్లీ కొడుకుల ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. అయితే ఇంతలోనే శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి సుధీర్ వెళ్లిపోవాల్సి వచ్చింది.

Indraja Gets Emotional On Sudheer In Extra Jabardasth Promo
అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి కూడా సుధీర్ బయటకు వచ్చేశాడు. అలా సుధీర్ బయటకు వెళ్లడంతో ఇంద్రజ ఎమోషనల్ అయింది. ఇదే విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చెప్పింది. సుధీర్, శ్రీను వెళ్లిపోవడంతో తాను ఒంటరిని అయ్యానంటూ ఆటో రాం ప్రసాద్ ఎంతగానో ఫీలయ్యాడు. ఎవరి దిష్టి తగిలిందో.. మీకు నాకు.. ఇలా అయిందంటూ ఇంద్రజ కంటతడి పెట్టేసింది. సుధీర్ లేని లోటును గుర్తు చేసుకుంది.
