Jabardasth faima : ఫైమా కుటుంబ కథ వింటే కన్నీరు పెట్టాల్సిందే.. జబర్దస్త్ నటి కష్టాలు
Jabardasth faima : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ కష్టాల కడలి నుంచి బయట పడటం కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూ జీవితంలో ముందుకు సాగుతారు. ఈ విధంగా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ కష్టాల సుడిగుండంలో నుంచి బయటపడటానికి జబర్దస్త్ నటి ఫైమా ఎన్నో కష్టాలు పడుతున్నారు.ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని మంచి పొజిషన్ కి వెళ్తున్న ఈ నటి కుటుంబ కథ వింటే తప్పనిసరిగా కన్నీళ్లు రాకమానవు.
ఫైమా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఈమె పటాస్ ప్రవీణ్ తో కలిసి ఒక వీడియో చేశారు.ఈ వీడియో ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి క్లారిటీ ఇవ్వడమే కాకుండా ప్రవీణ్ ఫైమా కుటుంబ కథను కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
Jabardasth faima revealed her emotional family story
Jabardasth faima : తండ్రి వేరే దేశం వెళితే తల్లి బీడీలు చుట్టుకుంటూ పెంచింది:
ఫైమా తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత తన తండ్రి వీరిని వదిలేసి ఇతర దేశాలకు వెళ్లి పోతే వీళ్ళ అమ్మ మాత్రం ఒక అద్దె ఇంట్లో ఉంటూ బీడీలు చుట్టుకుంటూ నలుగురు ఆడ పిల్లలను పెంచి పెద్ద చేసి ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేసి ఎన్నో కష్టాలను అనుభవించింది. ఇలా బీడీలు చుడుతూ ఇంటి అద్దె కడుతూ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేయడం అంటే అంత సులువైన పని కాదు. ఇలా ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ కుటుంబం ఇప్పుడు కాస్త ఆర్థికంగా కుదుటపడుతుంది. ఇప్పటికైనా ఫైమా ఒక సొంత ఇంటిని కట్టుకుంటే చూడాలని ఉంది అంటూ ప్రవీణ్ తన కుటుంబ కష్టాలను తెలియజేశారు.
