Jabardasth Rocking Rakesh : ఆ అమ్మాయి మంచిది కాదు.. రాకేష్‌పై ప్రేమను బయటపెట్టేసిన సుజాత
Jabardasth Rocking Rakesh : బుల్లితెరపై ట్రాకులు ఎంతగా వర్కవుట్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు చూపిస్తుంటారు. అలా రష్మీ సుధీర్ గత పదేళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇక మధ్యలో ఎంతో మంది అలా రొమాంటిక్ ట్రాక్‌లతో ఫేమస్ అవ్వాలని చూశారు.
అయితే రొమాంటిక్ ట్రాక్ చేస్తూ వర్ష ఇమాన్యుయేల్ నానా హంగామా చేశారు. ఇక ఫైమా ప్రవీణ్ ట్రాక్ కూడా ఉంది. ఆ మధ్య రాకేష్ రోహిణి ట్రాక్ కూడా బాగానే లేపేశారు. అయితే ఏమైందో ఏమో గానీ మధ్యలో సుజాత వచ్చింది. సుజాత రాకేష్ ట్రాక్ ఫుల్లుగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇద్దరూ లవర్స్, భార్యాభర్తలుగా నటిస్తూ స్కిట్లు వేసేశారు.

Jabardasth Sujatha Love With Rocking Rakesh In Latest Promo
Jabardasth Rocking Rakesh : వదిలేసేందుకు రెడీ..
తాజాగా వదిలిన ప్రోమోలో అయితే సుజాత మరింతగా రెచ్చిపోయింది. నిన్ను ఏరోజైనా ఎంత సంపాదిస్తున్నావో అడిగానా? నువ్వుంటే చాలు అని భారీ డైలాగ్ వేసింది. ఇక రోజా మధ్యలోకి దూరి.. ఒక వేళ రాకేష్ వేరే అమ్మాయితో బైక్ మీద వెళ్తే నీ ఫీలింగ్ ఏంటి? అని అడుగుతుంది. రాకేష్ అలా వెళ్లినా నాకేం బాధ లేదు.. కానీ ఆ అమ్మాయి మంచిది కాదు.. ఒక వేళ మంచి అమ్మాయి అయితే.. నేను ఇప్పుడే రాకేష్ వదిలేందుకు రెడీ అని సుజాత అంటుంది. అయితే ఇంతకీ ఆ అమ్మాయి రోహిణేనా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.