Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన సీరియల్.. కారణం ఇదే?
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సీరియల్ అభిమానులు.. ఈ సీరియల్ అంటే పడి చచ్చిపోతారు. ఇప్పటి వరకు బుల్లితెర మీద ఏ సీరియల్ కు రానంత క్రేజ్ ఈ సీరియల్ కు వచ్చింది. టీఆర్పీలో ఇప్పటి వరకు ఈ సీరియల్ ను బీట్ చేసిన సీరియల్ లేదు. ఎన్నో రియాల్టీ షోలు, కామెడీ షోలు కూడా కార్తీక దీపం ముందు దిగదుడుపే.

karthika deepam serial today episode not uploaded in hotstar
కార్తీక దీపం సీరియల్ లో నటించే డాక్టర్ బాబు, వంటలక్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో వాళ్లకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మధ్య.. కార్తీక దీపం సీరియల్ చూద్దామంటే.. మా ఇంట్లో అందరూ క్రికెట్ చూస్తున్నారు. నేను కార్తీక దీపం సీరియల్ ఎలా చూడాలి అక్క.. అంటూ ఓ నెటిజన్.. వంటలక్కకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడంతో వెంటనే అతడికి మరో టీవీ కొనిచ్చింది వంటలక్క. అది.. వంటలక్కకు బుల్లితెర మీద ఉన్న క్రేజ్.
Karthika Deepam : ఈరోజు హాట్ స్టార్ లో అప్ లోడ్ చేయలేదు
రోజూ స్టార్ మా చానెల్ లో రాత్రి 7.30 కు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఇదివరకు అంటే.. ఈ సీరియల్ కోసం రోజు మొత్తం వెయిట్ చేసేవారు. కానీ.. ఇప్పుడు ఉదయం 6 గంటలకే హాట్ స్టార్ లో ఆరోజు ఎపిసోడ్ ను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కార్తీక దీపం సీరియల్ అభిమానులు.. ఆ సీరియల్ ను ముందే హాట్ స్టార్ లో చూసేస్తున్నారు.

karthika deepam serial today episode not uploaded in hotstar
కానీ.. ఈరోజు సీరియల్.. 1131 ఎపిసోడ్ మాత్రం.. హాట్ స్టార్ లో అప్ లోడ్ కాలేదు. ఎప్పటిలాగే.. ఈ రోజు కూడా అప్ లోడ్ చేస్తారు కదా అని ఉదయం 6 గంటలకే అందరూ హాట్ స్టార్ ఓపెన్ చేశారు కానీ.. అందులో కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ కనిపించలేదు. ఇప్పటి వరకు ఆ ఎపిసోడ్ ను అప్ లోడ్ చేయలేదు. దీంతో కార్తీక దీపం సీరియల్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఇదివరకు కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల.. సీరియల్ అప్ లోడ్ కాస్త లేట్ అయింది. కానీ.. రెండు మూడు గంటల్లోనే వేసేవారు. ఈరోజు మాత్రం మధ్యాహ్నం 12 దాటినా కూడా ఇంకా ఆ సీరియల్ ను అప్ లోడ్ చేయకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కార్తీక దీపంతో పాటు ప్రసారం అయ్యే మిగితా సీరియళ్ల లేటెస్ట్ ఎపిసోడ్స్ ను అప్ లోడ్ చేసి.. కేవలం కార్తీక దీపం సీరియల్ ను అప్ లోడ్ చేయకపోవడంతో.. సీరియల్ ను ఆపేశారా? అని అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ టెన్షన్ కు తెర దించాలంటే.. రాత్రి 7.30 వరకు ఆగాల్సిందే.