Roja : జబర్ధస్త్‌లో డబుల్ మీనింగ్ డైలాగుల రచ్చ… ఏకంగా రోజా నోటి వెంట..!
Roja : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, అద్దిరిపోయే పర్‌ఫార్మెన్స్‌లతో ఈ షో తెగ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా సాగుతున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో తాగుబోతు రమేష్ ఓ స్కిట్ చేస్తున్నాడు. స్కిట్ లో తన భార్య పిలుస్తుంటే ఈ రోజు మంగళవారం అంటూ నో చెబుతున్నాడు. దాంతో జడ్జి రోజా మధ్యలో వచ్చి మంగళవారం అంటూ అదేదో సామెత ఉందిగా అంటూ దారుణమైన బూతు సామెతను గుర్తు చేసింది. దాంతో అందరూ ఒక్కసారిగా నోరు తెరిచారు.
అయితే జబర్ధస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులకి కొదవే లేదు. కాని ఈ సారి రోజా మేడం నోటి నుండి అలా పేలే సరికి అందరు నోరెళ్లపెడుతున్నారు. వందల ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ కామెడీ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఈ కామెడీ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉంది. జబర్దస్త్ ద్వారా ఎంతో మందికి లైఫ్ వచ్చింది. ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, ఆది సహా ఎంతో మందికి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ జబర్దస్త్ లో కొత్తవాళ్ల ఎంట్రీ ఉంటుంది. మొదట్లో జబర్దస్త్ లో పురుషులే మహిళలా నటించేవారు కానీ ఇప్పుడు మహిళలను సైతం తీసుకుంటున్నారు.

Roja Double meaning dialogues in viral
Roja : మంగళవారం అంటూ ముచ్చెమటలు పట్టించిన రోజా..
ఇక తాజా ప్రోమోలో ఆది, సుధీర్ కూడా తమ స్కిట్‌తో అలరించారు. అలానే చలాకీ చంటీ టెంపర్ మూవీ స్టైల్‌లో తనదైన వినోదం పంచాడు. ఇక మిగతా టీంస్ తమదైన స్టైల్‌లో స్కిట్స్ చేశారు.ఇక అనసూయ అయితే వీరి స్కిట్స్ చూసి తెగ నవ్వేసుకుంటుంది. అమ్మడిని పొట్టి దుస్తులలో చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఏదేమైన తాజాగా విడుదలైన ప్రోమో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు వీక్షించండి.