Shivaji : ఇలా చేస్తే నేను ఇంటికి వెళ్లి పోతా ‘.. బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన శివాజీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivaji : ఇలా చేస్తే నేను ఇంటికి వెళ్లి పోతా ‘.. బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన శివాజీ..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 October 2023,11:00 am

Shivaji : బిగ్ బాస్ లో ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు శివాజీ. అతడు హౌస్లో అందరికంటే సీనియర్ గా ఉన్నాడు. తన ఆట తో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లకు గురువుగా వ్యవహరిస్తున్నాడు. మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటున్నారు శివాజీ. అందుకే శివాజీ ఓటింగ్ లో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయితే రీసెంట్గా తను హౌస్ లో టాస్క్ ఆడుతున్నట్లు అతడి భుజానికి గాయమైన సంగతి తెలిసింది.

అందుకే అతడిని బయటికి పంపించి స్కానింగ్ కూడా తీశారు. ఇక టెస్ట్ ల తర్వాత వైద్యులు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పడంతో అతడిని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. అయితే శివాజీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి టాస్కులకు దూరంగానే ఉంటున్నాడు. టాస్కులు ఆడకపోయినా సరే శివాజీ టాప్ పొజిషన్లోనే ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో శివాజీ ఇంకా కోలుకోలేదు కాబట్టి అనారోగ్య సమస్యల కారణంగా సీజన్ సెవెన్ నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వస్తుందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజా ఎపిసోడ్లో శివాజీ ఎక్కి ఎక్కి ఏడ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివాజీ ఏడుస్తూ తన ముందు కూర్చున్న ప్రిన్స్ యావర్ ని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. బిగ్ బాస్ లో నీకోసం పల్లవి ప్రశాంత్ కోసమే ఉన్నాను అని లేకపోతే ఎప్పుడో వెళ్లిపోయే వాడిని అని ఎమోషనల్ అయ్యారు.

Shivaji warning to Bigg Boss Telugu 7

Shivaji warning to Bigg Boss Telugu 7

ఇంతలోనే అక్కడికి పల్లవి ప్రశాంత్ చేరుకున్నాడు. దీంతో ప్రశాంత్ ని పట్టుకొని శివాజీ ఎమోషనల్ అయ్యారు. నా బిడ్డల మీద ఒట్టు నేను మీకోసమే ఉన్నాను లేదంటే నాగార్జునను రిక్వెస్ట్ చేసి ఎప్పుడో బయటికి వెళ్లిపోయే వాడిని అని అన్నారు. దాంతో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఇద్దరు కలిసి శివాజీని ఓదార్చారు. ఆ తర్వాత ఇది పెద్ద సీన్ అవుతుందని భావించి అక్కడి నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. ఇక మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా శివాజీ ఉంటున్నారు. ప్రశాంత్ కోసం ఇప్పటికే చాలా త్యాగాలు చేశాడు. దీంతో పాటు హౌస్ లో అనుకూలంగా ఉండడంతో శివాజీని హౌస్ కి పెద్దగా చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది