Sudigali Sudheer – Rashmi Gautam : ‘ఆహా’ షో కోసం సుధీర్ రష్మీ కలవబోతున్నారా? ఇంట్రెస్టింగ్ అప్డేట్
Sudigali Sudheer – Rashmi Gautam : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న జంట సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్. వీరిద్దరూ జబర్దస్త్ లో కనిపించినా, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించినా, ఢీ డాన్స్ షోలో కనిపించినా కూడా ప్రేక్షకులు ఆ కార్యక్రమాలను తెగ చూసి సూపర్ హిట్ చేశారు. జబర్దస్త్ ప్రస్తుతం ఈ రేంజ్ సక్సెస్ లో దూసుకు పోతుంది అంటే ఒక కారణం సుడిగాలి సుదీర్ మరియు రష్మి గౌతమ్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ సుదీర్ఘ కాలం పాటు ప్రేమలో ఉన్నట్లుగా ఈటీవీ మల్లెమాల వారు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా మంచి స్నేహితులు..
ఇద్దరికీ ఎలాంటి అదనపు ఫీలింగ్స్ లేవు అయినా కూడా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రేక్షకులను నమ్మించి తమ షోలకు సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న ఈటీవీ మల్లెమాల వారు సాధ్యమైనంత ఎక్కువగా లాభాన్ని పొందారు అనడంలో సందేహం లేదు. అయితే కొన్నాళ్లుగా రష్మీ మరియు సుధీర్ కలిసి లేరు. వీరిద్దరూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్లుగా పరిస్థితి ఉంది, వీరిద్దరూ కూడా మళ్లీ కలిసి కార్యక్రమాలు చేస్తే చూడాలని ఎదురు చూస్తున్నాం అంటూ చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. వారి కోసం అన్నట్లు ఆహా ఓటీటీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని తీసుకు రాబోతుంది. ఆ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Sudigali Sudheer and Rashmi Gautam for aha ott comedy show
సుడిగాలి సుదీర్ తో పాటు జబర్దస్త్ నుండి రశ్మి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ లో చేస్తూనే సుడిగాలి సుదీర్ తో కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో రష్మి గౌతమ్ సందడి చేయబోతున్నట్లుగా బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. వీరిద్దరి యొక్క కెమిస్ట్రీని ఆహా ఓటీటీ కూడా సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకొని మంచి రేటింగ్ దక్కించుకునేందుకు ప్రయత్నం చేయబోతుందట. ఈ కార్యక్రమానికి జడ్జిగా అనిల్ రావిపూడి వ్యవహరించబోతున్నాడు. అల్లు అరవింద్ తనదైన క్రియేటివ్ మైండ్ తో ఈ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేస్తాడని అంతా నమ్ముతున్నారు.