Anasuya : అనసూయ అందం వెనుక ఉన్న టాప్ సీక్రెట్ ఇదే .. డైలీ ఇది తాగుతుంది.. !
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ షో తో అనసూయ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ లో కేవలం కామెడీ చూడటానికి మాత్రమే కాకుండా అనసూయ అందాలను చూడడానికి ఎక్కువగామంది చూసేవారు. ఇటీవల జబర్దస్త్ మానేసి సినిమాల వైపు వెళ్ళింది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది.
మరోసారి సుకుమార్ డైరెక్షన్ పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే మొదటినుంచి అనసూయ అందానికి చాలామంది ఫాన్స్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఓ సందర్భంలో అనసూయ తన అందం సీక్రెట్ ను సోషల్ మీడియాలో బయటపెట్టింది. ఆ సీక్రెట్ ఏంటంటే అనసూయ ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తుంది. అంతేకాకుండా రాత్రి భోజనానికి బదులు ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటాననీ, అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని చెప్పింది. అవే తన బ్యూటీ సీక్రెట్స్ అని చెప్పింది.
అయితే ఈ హెల్త్ టిప్స్ కోసం అనసూయ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. నిజానికి రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిది, గుండెకు చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా ఆకలిగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర పట్టదు కాబట్టి ఆ సమయంలో రెడ్ వైన్ తీసుకుంటానని అనసూయ తెలిపింది. అయితే ఈ చిట్కా అందరికీ వర్కౌట్ కాదని, తనకు బాగా పనిచేసిన చిట్కా వేరే వాళ్లకు పనిచేయకపోవచ్చు అని చెప్పింది. ఎవరి శరీర తత్వాలు వారివి. దాని అనుసరించి ఏదైనా చేయాలంటే వివరంగా చేయాలి చెప్పింది. ఇదిలా ఉంటే అనసూయ ఎన్నోసార్లు రెడ్ వైన్ తాగుతున్నట్లు గ్లాస్ పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.