Urfi Javed : ఫుల్‌గా తాగేసి మైకంలో మీడియా ముందుకు వ‌చ్చి ర‌చ్చ‌.. త‌ర్వాత ఏమైందంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Urfi Javed : ఫుల్‌గా తాగేసి మైకంలో మీడియా ముందుకు వ‌చ్చి ర‌చ్చ‌.. త‌ర్వాత ఏమైందంటే..!

Urfi Javed : ఉర్ఫీ జావేద్…ఈ భామ ఏదో ఒక విష‌యంతో లైమ్ లైట్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంటుంది. నిత్యం వింత డ్రెస్సులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరికీ సాధ్యం కాని కాస్ట్యూమ్స్ తో ప్రశంసలతో పాటు ట్రోలింగ్ కు గురవుతుంటుంది.. బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు బాగా పాపులర్ కావడానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,9:00 pm

Urfi Javed : ఉర్ఫీ జావేద్…ఈ భామ ఏదో ఒక విష‌యంతో లైమ్ లైట్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంటుంది. నిత్యం వింత డ్రెస్సులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరికీ సాధ్యం కాని కాస్ట్యూమ్స్ తో ప్రశంసలతో పాటు ట్రోలింగ్ కు గురవుతుంటుంది.. బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు బాగా పాపులర్ కావడానికి కారణం అయ్యాయి. బిగ్ బాస్ షోకు ముందే ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’ సీరియల్ లో అవనీ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించి ఆకట్టుకుంది.

Urfi Javed ఇదేమ‌న్నా బాగుందా..

2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రలో ఆకట్టుకుంది. 2018లో SAB TV ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి క్యారెక్టర్ లో కనిపించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా కనిపించింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది. నన్ను తిట్టినా, పొగిడినా నన్నేతే మర్చిపోకుండా గుర్తు పెంటుకుంటున్నారు కదా అంటోంది ఉర్ఫీ. ఈ భామ వీకెండ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ముంబైలోని పోష్ పబ్ నుంచి తాగి బయిటకు వస్తూ మీడియాకు దొరికిపోయింది. ఆమె తనను వీడియో తీస్తున్నా వారించకుండా నేను ఫుల్ గా తాగాను అంటూ వాళ్ళతో చెప్పుకొచ్చింది. తాగి నడవలేని స్దితిలో ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

Urfi Javed ఫుల్‌గా తాగేసి మైకంలో మీడియా ముందుకు వ‌చ్చి ర‌చ్చ‌ త‌ర్వాత ఏమైందంటే

Urfi Javed : ఫుల్‌గా తాగేసి మైకంలో మీడియా ముందుకు వ‌చ్చి ర‌చ్చ‌.. త‌ర్వాత ఏమైందంటే..!

తెల్లారి తను వీడియో వైరల్ అవటం గమనించిన ఉర్ఫీ రాత్రి తన ప్రెండ్స్ తో కలిపి నైట్ అవుట్ పార్టీ చేసుకున్నామని కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అలాగే తను తాగటానికి ముందు తన మేకప్ తీసేయటం, డ్రస్ మార్చుకోవటం చేయటం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. కొందరు మాంసం తిన్నామని ఎముకలు మెళ్లో వేసుకుతిరుగుతామా..ఇలా తాగి మీడియా ముందుకు రావటం ఎందుకు అని విమర్శిస్తున్నారు. ఏది ఏమైన కూడా ఈ భామ సోషల్ మీడియానే నమ్మకుని.. వింత డ్రస్సులతో కుర్రకారు ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటుంది. తరచూ వింత డ్రెస్సులు వేసుకుంటూ ట్రోలర్లకు టార్గెట్ అవుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది