World Chocolate Day : బంధాలు పెంచుకోవాలంటే చాక్లెట్లను పంచుకోవాలి… చాక్లెట్ స్టోరీ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

World Chocolate Day : బంధాలు పెంచుకోవాలంటే చాక్లెట్లను పంచుకోవాలి… చాక్లెట్ స్టోరీ ఇదే..!

World Chocolate Day : చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఏదైనా శుభకార్యానికి అలాగే పుట్టినరోజు కు అందరికీ పంచి పెడుతూ ఉంటారు. అయితే చాక్లెట్లు రకరకాల ఫ్లేవర్లతో కలిగి ఉంటాయి.. అందరూ ఇష్టపడే చాక్లెట్లుకు కూడా ఒక శుభదినం అనేది ఉంటుంది.అది జూలై 7న వరల్డ్ చాక్లెట్ డే గా జరుపుకుంటారు.. అసలు దీని స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… 1550లో యూరప్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  World Chocolate Day : బంధాలు పెంచుకోవాలంటే చాక్లెట్లను పంచుకోవాలి... చాక్లెట్ స్టోరీ ఇదే..!

World Chocolate Day : చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఏదైనా శుభకార్యానికి అలాగే పుట్టినరోజు కు అందరికీ పంచి పెడుతూ ఉంటారు. అయితే చాక్లెట్లు రకరకాల ఫ్లేవర్లతో కలిగి ఉంటాయి.. అందరూ ఇష్టపడే చాక్లెట్లుకు కూడా ఒక శుభదినం అనేది ఉంటుంది.అది జూలై 7న వరల్డ్ చాక్లెట్ డే గా జరుపుకుంటారు.. అసలు దీని స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… 1550లో యూరప్ లో ప్రపంచ చాక్లెట్ జరుపుకుంటారట. అప్పట్లో మెక్సికో అమెరికా లాంటి దేశాలలో మాత్రమే చాక్లెట్లు దొరికేవట అయితే ఈ ప్రోగ్రాంను యూరోపియన్ ఖండానికి తీసుకురావాలని కోరుకున్నారట.

అక్కడివారు 1519లో ఆజెక్టు చక్రవర్తి దీనికి చాక్లెట్ అనే పేరు పెట్టారంట.ఈ చక్రవర్తి చక్కెర, వెనిలా మరియు దాల్చిన చెక్కను జోడించి దీనిని తియ్యగా తయారు చేసేవాడట. 1800 లో ఘన అంటే గట్టిగా ఉండే చాక్లెట్ జనం ఇష్టపడడం మొదలుపెట్టారు. ఇలా వచ్చిన చాక్లెట్ అందరికీ ఎంతో ఫేవరేట్ గా మారింది.చాక్లెట్ డే ని ఎలా జరుపుకుంటారు.. ఇష్టమైన చాక్లెట్ బార్, చాక్లెట్ లేదా హార్ట్ చాక్లెట్ డ్రింకులను టేస్ట్ చేయాలి. మీకు ఇష్టమైన వారితో ఈ చాక్లెట్లను పంచుకోవాలి.

చాక్లెట్లు లేదా బ్రౌన్ వైట్ పీస్ ను తయారు చేసుకోండి. వీటిని అందరితో కలిసి తింటూ ఆనందాన్ని పంచుకోండి.. ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కరి మధ్య అనుబంధం పెరుగుతుంది.. దీనిని ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచ చాక్లెట్ డే గా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు చాక్లెట్లు లవర్స్ అంత రకరకాల చాక్లెట్లు పంచుకోవడంలో రుచి చూడడంలో తయారు చేయడంలో బిజీ బిజీగా ఉంటారు. అసలు చాక్లెట్స్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎన్నో సందర్భాలలో ప్రియమైన వారికి మంచి వార్తలు చెప్పడానికి చాక్లెట్లు పంచి పెడుతూ ఉంటారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది