Janasena : ‘పంచాయతీ’ లో మార్పు మొదలు.. 2024లో వైసీపీ, టీడీపీ దుకాణాలు బంద్..?
Janasena : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో ఘోరంగా ఓడిపోయింది. ఒక్కటంటే ఒక్కటే ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీని ఏపీ ప్రజలు ఈ రేంజ్ లో వ్యతిరేకిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాకపోయినా.. కనీసం డిపాజిట్లను అయినా దక్కించుకొని.. కనీసం ఓ 10 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లను అయినా గెలుచుకొని.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని అంతా భావించారు. పవన్ కూడా ఆ ఉద్దేశంతోనే ఏపీలో ఉన్న దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ.. ఫలితం అందరం చూశాం. దీంతో జనసేన పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా బయటికి వెళ్లిపోయారు. అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. 2019 ఎన్నికలు ముగిసి రెండు సంవత్సరాలు అయింది.
ఆ తర్వాత మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగలేదు. తాజాగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది.. అనే విషయం సుస్పష్టమవుతోంది.
అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి తన సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 18 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. రెండో విడత ఎన్నికల్లో 22 శాతం ఓట్లు వచ్చాయి.
రెండో దశలో సుమారు 250 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలను జనసేన గెలిచింది. 1500 పైగా పంచాయతీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచింది. సుమారు 1500 వార్డులను పార్టీ కైవసం చేసుకుంది.
Janasena : ఇదే జోరు 2024 వరకు కొనసాగితే.. జనసేనకు తిరుగులేదు
2019 నుంచి 2021 లోనే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు జనసేనను ఆదరించని ప్రజలు.. ఇప్పుడు జనసేనను ఆదరిస్తున్నారు. అంటే ఏపీ ప్రజలు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ పాలన చూశారు… వైసీపీ పాలన చూశారు.. కాంగ్రెస్ పాలన చూశారు. ఈ పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలు.. ఖచ్చితంగా 2024లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జనసేనే అని పంచాయతీ ఎన్నికలతో అర్థమయిపోతోంది.
బీజేపీతో జతకట్టినా కూడా జనసేన పార్టీకి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత తగ్గలేదు. ఇన్ పాక్ట్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇది ఇలాగే 2024 వరకు కొనసాగితే.. నో డౌట్.. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ మిగితా పార్టీలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రభుత్వ ఏర్పాటులో జనసేన ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పార్టీని జనాలు ఆదరిస్తున్నారు. ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజా సమస్యలపై పోరాడితే.. 2024 లో జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు.