ఆ ఒక్క పొరపాటు చేసుంటే ఈ రోజు చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడయ్యేవారు కాదు ..?

Advertisement

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక సామాన్య కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కొచ్చిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ పునాది రాళ్ళు సినిమాతో తన పునాదిని గట్టిగా వేసుకున్నాడు. అయితే అదే ఏడాది చిరంజీవి నటించిన మరో సినిమా ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. అక్కడ నుంచి అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి.. సుప్రీం హీరోగా.. సూపర్ స్టార్ గా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Advertisement
ఆ ఒక్క పొరపాటు చేసుంటే ఈ రోజు చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడయ్యేవారు కాదు ..?
story behind chiranjeevi and surekha marriage

అయితే మెగాస్టార్ చిరంజీవి అన్నది కేవలం స్క్రీన్ మీద.. పోస్టర్స్ మీద చూసుకునే పేరు మాత్రమే. అభిమానులకి అన్నయ్య.. ఇంట్లో వాళ్ళకి చిరు. అయితే చిరంజీవి ఈ రోజు అల్లు ఫ్యామిలీకి అల్లుడుగా అయ్యాడంటే అంత సులభంగా ఈ వ్యవహారం జరగలేదు. దీని వెనక చాలా పెద్ద తతంగమే జరిగింది. చిరంజీవి ఇండస్ట్రీకొచ్చినప్పటికే అల్లు రామలింగయ్య ప్రముఖ హాస్య నటుడిగా ఎంతో పాపులర్ అయి ఉన్నాడు. అప్పటికే ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారట. ఆ సమయంలో చిరంజీవిని దగ్గరగా గమనించిన అల్లు రామలింగయ్య మనసులో తన ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలన్న కోరిక కలిగిందట.

Advertisement
ఆ ఒక్క పొరపాటు చేసుంటే ఈ రోజు చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడయ్యేవారు కాదు ..?
story behind chiranjeevi and surekha marriage

అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్ళి చేయాలని భావించి తన భార్య అల్లు కనకరత్నంతో చెప్పగా ఆవిడకి చిరంజీవి మీద అప్పటికే మంచి అభిప్రాయం ఉండటంతో సరే అని చెప్పారట. ఆ తర్వాత కొడుకు అల్లు అరవింద్ కి ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య ప్రస్తావించగా అరవింద్ కాస్త సమయం కావాలని చెప్పాడట. అందుకు కారణం చిరంజీవి హీరో కావడం.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడమే.

ఆ ఒక్క పొరపాటు చేసుంటే ఈ రోజు చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడయ్యేవారు కాదు ..?
story behind chiranjeevi and surekha marriage

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే త్వరగా ఎవరికీ సదభిప్రాయం కలగదు. ఈ క్రమంలోనే అరవింద్ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో చిరంజీవి గురించి ఎంక్వైరీ చేశాడట. ప్రతీ ఒక్కరు చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పారట. దాంతో అల్లు అరవింద్ కి చిరంజీవి మీద ఇష్టం, గౌరవం పెరిగాయట. అంతేకాదు ఇక్కడ అల్లు రామలింగయ్యకే చిరంజీవి కి ఉన్న అలవాట్లు తెలుసుకునే ఒక సంఘటన కూడా జరిగిందట. ఈ సంఘటన గనక తేడా కొట్టి ఉంటే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి అల్లుడుగా వచ్చేవారు కాదట.

ఒకసారి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ట్రైన్ లో అల్లు రామలింగయ్య తోటి నటులతో వస్తున్నారట. అదే ట్రైన్ లో చిరంజీవి కూడా ప్రయాణం చేస్తున్నాడని తెలిసిన రామలింగయ్య.. పక్క కంపార్ట్ మెంట్ లో చిరంజీవిని కలిసి కాసేపు ముచ్చటించాక సరదాగా తీసుకోమని వైన్ ఆఫర్ చేశారట. కాని చిరంజీవి వైన్ తాగడం అలవాటు లేకపోవడం తో సున్నితంగా రామలింగయ్య ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాట. ఆ సమయంలో చిరంజీవి మీద అల్లు రామలింగయ్యకి పూర్తిగా నమ్మకం కలగడం తో ఇతనే నా అలుడు అని డిసైడయ్యాడట. పొరపాటున ఆ రోజు గనక చిరంజీవి మొహమాటానికి పోయి అల్లు రామలింగయ్య అడగగానే వైన్ తీసుకొని ఉంటే ఆ రిలేషన్ అక్కడికే ఆగిపోయి ఉండేదట.

Advertisement
Advertisement