Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం…!

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం...!

Aloe Vera : అలోవెరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో A, C, E విటమిన్స్ మరియు ఫోలిక్ యాసిడ్, కొలీన్ బి వన్, బి టు, బి త్రీ, బి సిక్స్, బి 12 విటమిన్లు, కాల్షియం, జింక్,క్రోమియం, సెలీనియం, మెగ్నీషియం, సోడియం, ఐరన్, పొటాషియం లాంటి దాదాపుగా 20 రకాల ఖనిజాలు ఉన్నాయి. అయితే ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఇది ఎన్నో వ్యాధుల నివారణకు కూడా దివ్య ఔషధంగా వాడతారు. కావున అలోవెరా జెల్ ప్రయోజనాలు మరియు దానిని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అలోవెరా జెల్ ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు : అలోవెరా జెల్ ముఖానికి ఫైన్ లైన్స్ సమస్య నుండి బయటపడెందుకు ఈజీ పరిష్కారమని చెప్పొచ్చు. అయితే దీనిని చేతులకు మరియు ముఖానికి అప్లై చేసుకోవడం వలన చర్మంలో కొల్లాజెన్ స్థాయిలు అనేవి పెరిగి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే దీనిని రోజు ముఖానికి రాసుకోవడం వలన చర్మం మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది…

Aloe Vera సూర్యకిరణాల నుండి రక్షణ

అలోవెరా శరీరానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అలాగే అలోవెరా జెల్ ముఖానికి రాసుకోవడం వలన దద్దుర్లు మరియు ముఖం వాపు లాంటి సమస్యల నుండి కూడా ఉపసమనాన్ని కలిగిస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేసుకోవటం వలన సూర్యకిరణాలు చర్మంపై ప్రభావితం చూపించకుండా ఉంటుంది. అలాగే బయట పని చేసేవారు ఇంటికి వచ్చిన తర్వాత అలోవెరా జెల్ ముఖానికి రాసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది…

Aloe Vera కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం

Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం…!

మొటిమల నివారణ : రాత్రి పూట అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకున్నట్లయితే రంధ్రాలలో పేర్కొన్నటువంటి దుమ్మును పోగొట్టటమే కాక ముఖంపై మొటిమలను కూడా తగ్గిస్తుంది. అలాగే ముఖంపై రిలీజ్ అయ్యే ఎక్కువ నూనె మొటిమలను కూడా తొలగిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో చర్మం నుండి ఎక్కువ నూనెను తొలగించేందుకు అలోవేర ఎంతో ఉపయోగపడుతుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది