Arthritis : కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే.. కీళ్ల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి..!
Arthritis : ప్రస్తుత జనరేషన్ లో కీళ్ల నొప్పుల సమస్య అనేది అందరినీ వేధిస్తోంది. ఇదివరకు కీళ్ల నొప్పులు అంటే.. పెద్ద వాళ్లకు, వయసు మళ్లిన వాళ్లకే వచ్చేది. కానీ.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. కీళ్ల నొప్పుల సమస్య మనల్ని వేధిస్తోంది. కీళ్ల నొప్పుల సమస్య రావడం వల్ల చాలామంది ఏ పనులు చేయలేకపోతున్నారు. చాలామందికి అతి చిన్న వయసులోనే ఎముకలు అరిగిపోతుంటాయి. దీంతో కీళ్లనొప్పుల సమస్య వేధిస్తుంటుంది. దాని వల్ల.. శరీరం తన పటుత్వాన్నే కోల్పోతుంది.
కొందరికి వయసు మీద పడితే.. కీళ్ల నొప్పులు వస్తాయి. మరికొందరికి అధిక బరువు ఉండటం వల్ల.. ఆ బరువును ఎముకలు మోయలేక నొప్పులు వస్తాయి. అయితే.. కీళ్ల నొప్పుల సమస్య.. మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా వస్తుంది. దానికి కారణం అధిక బరువుతో పాటు.. కాల్షియం తక్కువగా ఉండటం, పోషకాహార లోపం, బలహీనతగా ఉండటం. అయితే.. కీళ్ల నొప్పులు ఏ వయసులో వచ్చినా సరే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కీళ్ల నొప్పులు మళ్లీ జన్మలో కూడా రావు. దాని కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం కూడా లేదు. మన వంటింట్లోనే ఆ రహస్యం ఉంది. అవేంటో తెలుసుకుందాం పదండి.
Arthritis : కీళ్ల నొప్పులతో పాటు పక్షవాతం సమస్య రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
చాలామందికి కీళ్ల నొప్పులతో పాటు.. నడుం నొప్పి, చేతుల నొప్పులు, పక్షవాతం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాళ్లు.. వెల్లుల్లిని తీసుకొని దాన్ని దంచి.. దాని నుంచి రసం తీసి.. వెల్లుల్లి మిశ్రమం, రసం కలిపి దాంట్లో కాసింత నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాసేపు దాన్ని మరిగించాలి. ఆ తర్వాత దాన్ని మెత్తగా నూరి ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్న రోజూ కాసింత.. భోజనంలో కలుపుకొని తినాలి. అలా నిత్యం చేస్తే కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
శొంఠి, మోడి, పిప్పిలిని తీసుకొని వాటిని విడివిడిగా నెయ్యితో పాటు వేయించి.. ఆ తర్వాత వాటిని మొత్తం కలిపి దాంట్లో కాసింత పెరుగు, నువ్వుల నూనె కలిపి మరిగించాలి. ఆ మిశ్రమాన్ని వడబోసి.. వచ్చిన నూనెను ఓ డబ్బాలో పోసుకొని.. ఎక్కడైతే శరీరం మీద నొప్పులు ఉంటాయో.. ఆ ప్రాంతంలో మర్దన చేసుకోవాలి. నిత్యం అలా చేస్తే కీళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, ఇతర భాగాల్లో నొప్పులు తగ్గుతాయి.
ఆయుర్వేద షాపుల్లో ధన్వంతరి తైలం, శ్రీరజలా తైలం దొరుకుతాయి. ఆ తైలాలను తీసుకొచ్చి.. వాటిని కీళ్ల నొప్పులు ఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే.. అన్నం వండే సమయంలో పడేసే గంజిని తీసుకొని దాంట్లో కాసింత శొంఠి పొడి, ఉప్పు, చక్కెర కలుపుకొని తాగాలి. అలా చేసినా కూడా కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి ==> Diabetes : ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు బట్టతల ఉందా? ఈ పని చేశారంటే మీరు వద్దన్నా కూడా తలపై జుట్టు మొలుస్తుంది..!
ఇది కూడా చదవండి ==> తొక్కే కదా అని తీసేస్తే మీకే నష్టం.. అరటి తొక్క వల్ల కలిగే లాభాలు ఇప్పుడే తెలుసుకోండి..!