Banana : అరటిపండే కదా అని సింపుల్ గా తీసుకుంటున్నారా..? రోజుకొకటి తింటే అద్భుతాలే చూస్తారు..
ప్రధానాంశాలు:
Banana : అరటిపండే కదా అని సింపుల్ గా తీసుకుంటున్నారా..? రోజుకొకటి తింటే అద్భుతాలే చూస్తారు..
Banana : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసింది.. అందరూ ఎక్కువగా తినే పండ్లు అరటి పండ్లు.. అయితే ఈ పండ్లను కొంతమంది చీప్ గా చూస్తూ ఉంటారు. కానీ దీనితో ఎన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండ్లు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పండు అరటిపండు. అయితే దీనిని సింపుల్గా చూస్తారు. చూడడానికి సింపుల్ గా ఉన్న కానీ దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వేసవి సీజన్లో అరటిపండు తినడం వల్ల ఎన్నో రోగాలను తగ్గించుకోవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్ b6, మెగ్నీషియం ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణ క్రియ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం చూద్దాం…
Banana : మలబద్ధకం కి చెక్
అరటిపండు తినడం వలన మలబద్ధకం రోగులకు సంజీవినిలా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనికోసం అరటిపండుతో పాటు పాలు కూడా తీసుకోవాలి. రోజు రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు.. రక్తాన్ని పల్చగా చేస్తుంది: అరటిపండు శరీరంలో రక్తాన్ని పల్చగా చేయడానికి ఉపయోగపడుతుంది. అరటిపండు రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండ్లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గినప్పుడు రక్తనాళాలు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది..
Banana : జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది
సమ్మర్ లో ప్రజలు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు అరటిపండును ఈ సీజన్లు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం వలన మీరు అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. కావున రోజు అరటిపండు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.. మోషన్స్ కి చెక్: ఈ వేసవిలో వేడి కారణంగా ప్రజలు విరోచనాలకు గురవుతూ ఉంటారు. అటువంటి సమయాలలో అరటిపండు తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు అరటిపండుతో పాటు కొంత చక్కర కలుపుకొని తినడం వలన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది..