Tulsi Leaves : రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulsi Leaves : రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tulsi Leaves : రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను తీసుకుంటే... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!

Tulsi Leaves : తులసి ఆకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆయుర్వేద పరంగా కూడా దీనిలో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఈ తులసిని టీలో చేర్చుకోవడం వలన జలుబు మరియు గొంతు నొప్పి, జ్వరం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు. అంతేకాక ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు కూడా తులసితో చేసిన కషాయాన్ని వాడతారు. అయితే మన అమ్మమ్మల కాలం నుండి తులసిని హోమ్ రెమిడిగా ఉపయోగిస్తున్నారు. అయితే రోజు ఉదయాన్నే పరకడుపున 4 తులసి ఆకులను తీసుకోవడం వలన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం నాలుగు తులసి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి. అయితే తులసి ఆకులను డైరెక్టుగా తినకుండా నీటిలో వేసుకొని తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ ఆకులను నమిలి తినడం వలన దంతాలపై ఎనామిల్ పై పొర అనేది దెబ్బతింటుంది.

బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది : నిత్యం ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసుకొని ఆ నీటిని తీసుకోవటం వలన జీవక్రియను పెంచి బరువును తగ్గించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు తగ్గాలి అని అనుకునేవారు రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నీటిలో కలిపి తీసుకుంటే చాలు.

పదేపదే జబ్బున పడరు : మారుతున్నటువంటి సీజన్ లో వచ్చే వైరస్ వ్యాధుల బారిన పడటం అనేది సర్వ సాధారణం. అయితే పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా జలుబు మరియు దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే నిత్యం ఉదయాన్నే తులసిని తీసుకోవడం వలన మీరు ఈ వైరల్ ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఎందుకు అంటే తులసి రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది.

Tulsi Leaves రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

Tulsi Leaves : రోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

శరీరం డిటాక్స్ అవుతుంది : నిత్యం ఉదయాన్నే తులసి ఆకులను నీళ్లలో కలిపి తీసుకున్నట్లయితే శరీరంలోని విష పదార్థాలు కూడా బయటకు పోతాయి. అలాగే అనారోగ్యాన్ని కలిగించే టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. నిజానికి శరీరం తానను తాను డిటాక్స్ చేసుకుంటుందన్నమాట. కానీ ప్రస్తుతం ఆహారం మరియు పర్యావరణం అనేది రసాయాలతో నిండి ఉంది. దీని వలన శరీరంలో టాక్సీన్స్ అనేవి ఎంతో వేగంగా పేరుకు పోతాయి. ఇవి అవయవాలపై కూడా అదనపు ఒత్తిడి కలిగిస్తాయి. కాబట్టి తులసిని తీసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది…

జర్ణక్రియ మెరుగుపడుతుంది : రోజు ఉదయాన్నే తులసి ఆకులను తీసుకోవడం వలన జర్ణక్రియ కూడా ఎంత సక్రమంగా పనిచేస్తుంది. అలాగే ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, యాసిడ్ రీప్లక్స్ లాంటి కడుపుకు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది