Health Tips : ఫోన్ పక్కన పెట్టుకొని రాత్రి నిద్రపోతున్నారా.? అయితే ప్రమాదంలో ఉన్నట్లే…!
Health Tips : చాలామంది నిద్రపోయే టైంలో కూడా ఫోన్ లను పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నవాళ్లను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొందరైతే అర్ధరాత్రి వరకు ఫోన్లను చూస్తూనే ఉంటారు. ఇలా ఈ ఫోన్లకి అతుక్కుపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు. అని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరిగింది. చాలామంది వేరువేరు నిద్ర అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి లైట్ వేస్తే నిద్ర పట్టదు. అయితే ఎవరి అలవాట్లు వారికి ఉంటాయి. అయితే రాత్రి పడుకునే ముందు మొబైల్స్ టీవీ లాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించే వారికి నిద్ర సమస్యలు తప్పవు…
టీవీ గుండా వచ్చే నీలి కిరణాలు రేటీనాలను దెబ్బతీస్తాయి. టీవీ ఆన్ లో ఉంచుకొని నిద్రించడం వల్ల సమీప భవిష్యత్తులో అధిక బరువు, ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పటికీ గదిలో బాగా వ్యాపించి ఈ కిరణాలు మీ కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.
ఈటీవీ నుంచి వచ్చే నీలి కిరణాలు నిద్ర తర్వాత కూడా బ్రెయిన్ ని అలర్ట్ గా ఉంచుతుంది. రాత్రి సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను అధికంగా వాడే వ్యక్తులు మిగతా వారి కంటే అధికంగా డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు. దీనివలన మెదడుకి తగినంత విశ్రాంతి దొరకదు.రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ ఫోన్ తో గడుపుతూ ఉంటారు.
ఈ విధంగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి మీరు పడుకునే ముందు అంటే ఓ అరగంట మునుపు స్మార్ట్ ఫోన్ పూర్తిగా పక్కకు పెట్టేయాలి.బ్లూ లైట్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మొబైల్ ఫోన్లు హానికరమైన రేడియేషన్ను విడుదల చేస్తూ ఉంటాయి. ఇవి మన మీదనే దెబ్బతీస్తాయి. ఇది తలనొప్పి, కండరాల నొప్పి ఇతర అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో టీవీ లాప్టాప్ లు కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడడం మానుకోండి. లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అవకాశం ఉంటుంది.