Earphone : చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఎక్కువసేపు సౌండ్స్ వింటున్నారా… అయితే, 30 ఏళ్లకే ఈ వ్యాధులు గ్యారెంటీ…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Earphone : చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఎక్కువసేపు సౌండ్స్ వింటున్నారా… అయితే, 30 ఏళ్లకే ఈ వ్యాధులు గ్యారెంటీ…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •   Earphone : చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఎక్కువసేపు సౌండ్స్ వింటున్నారా... అయితే, 30 ఏళ్లకే ఈ వ్యాధులు గ్యారెంటీ...?

Earphone :  ప్రస్తుతం ప్రజలు చేతిలో సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, చెవుల్లో ఇయర్ ఫోన్స్. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక, ఈ వినియోగం మరింత తీవ్రమైయింది. కొంతమంది గంటల తరబడి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటూనే ఉంటారు. ఓ సౌండ్ తో సాంగ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. మీ చెవులు మీరే పాడు చేసుకున్నట్లే.. పెద్ద పెద్ద శబ్దాలు వింటే వినికిడి సామర్ధ్యం దెబ్బతింటుంది. సౌండ్ ని మనం అస్సలు తట్టుకోలేము. ఈ విషయం మనకు తెలుసు. అయినా కానీ మనం ఏమాత్రం పట్టించుకోమ్. అలాగే, ఇయర్ ఫోన్స్ కూడా అంతే ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి…మన చెవి లోపల చిన్న చిన్న వెంట్రుకల లాంటి కణాలు ( Tiny Hair Cells ) ఉంటాయి. మనం శబ్దాలను గుర్తిస్తున్నామంటే ఈ కణాలే కారణం. మరి పెద్ద సౌండ్ విన్నప్పుడు అవి బెండ్ అయిపోతాయి. కాసేపు రెస్ట్ ఇస్తే అవి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ రోజు అదే పనిగా ఎక్కువ సౌండ్స్ నీ వింటే మాత్రం అవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

Earphone చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఎక్కువసేపు సౌండ్స్ వింటున్నారా అయితే 30 ఏళ్లకే ఈ వ్యాధులు గ్యారెంటీ

Earphone : చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఎక్కువసేపు సౌండ్స్ వింటున్నారా… అయితే, 30 ఏళ్లకే ఈ వ్యాధులు గ్యారెంటీ…?

 Earphone కాస్త తక్కువ సౌండ్ తో విన్నా డేంజరే

చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం పెద్దగా ఉంటేనే కాదు, మీడియం సౌండ్ లో విన్నా కూడా చెవులు పాడైపోతాయని డాక్టర్ స్మితా నాగౌoకర్ హెచ్చరిస్తున్నారు. ఈమె సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ENT స్పెషలిస్ట్, ( చెవి,ముక్కు,గొంతు డాక్టర్ )’ టైమ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ ‘ తో మాట్లాడుతూ, సౌండ్ ఎంతసేపు వింటున్నారనేది కూడా ముఖ్యమే అని చెప్పారు. ఓపెన్ ప్లేస్ లలో జరిగే పెద్ద కచేరీ కి ఎక్కువ సేపు వెళ్లినా, ఇంకా చెవి దగ్గర బాంబు పేలినా ఒకేలాంటి నష్టం జరుగుతుందని ఆమె అన్నారు.
ఒక తాజా అధ్యయనంలో, దాదాపు ఒక బిలియన్ ( 100 కోట్ల మంది ) యంగ్ పీపుల్ ఇయర్ ఫోన్స్ అతి వాడకంతో వినికిడి లోపం వచ్చే రిస్క్ ఉన్నది. ఒకసారి వినికిడి లోపం తలెత్తితే అది పర్మనెంట్గా డామేజ్ అయినట్లే. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మునుపటిలాగా చెవులు వినపడవు. కాబట్టి, ముందు జాగ్రత్తగా శబ్దాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

 Earphone వినికిడి సమస్యల సంకేతాలు

వినికిడి శక్తిని కోల్పోయినప్పుడు మొదట శరీరం కొన్ని సింటమ్స్ ఇస్తుంది. అవేంటంటే, చెవుల్లో రింగు మంటూ, ఝుమ్మంటూ, లేదా బుస్సుమంటూ, (Hissing Sounds ) శబ్దాలు వినిపించడం. తీగ ఉండే ప్రదేశాల్లో మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం. అలాగే శబ్దాలన్నీ గందరగోళంగా అనిపించడం, చెవులు మూసుకుపోయినట్లు ఉండడం. ఇంకా టీవీ సౌండ్ లేదా పాటల సౌండ్ ఇంతకుముందు కంటే ఎక్కువ పెట్టాల్సి రావటం వంటివి కనిపిస్తాయి.
నిజానికి వినికిడి సమస్య ఉందో లేదో నిర్ధారించుకోవాలంటే డాక్టర్లని తప్పనిసరి కలవాలి. ఇయర్ రింగ్ టెస్ట్ ద్వారా ఈ సమస్యను వారు గుర్తిస్తారు. అయితే,ఇయర్ ఫోన్స్ వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మాత్రం కచ్చితంగా ఆపోవచ్చు. అందుకు సేఫ్ లిజనింగ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి. 60%60 రూల్ పాటించమని డాక్టర్ సూచిస్తారు. అంటే, 60 శాతం వ్యాల్యూలో, 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వినకూడదని నియమం పెట్టుకోవాలి.

 Earphone చెవులు సేఫ్ గా ఉండాలంటే ఎలా

ఇయర్ ఫోన్స్ ని వాడకుండా ఉండలేకపోయినా పర్లేదు, కానీ ఈ టిప్స్ ని ఫాలో అయితే చెవులు సేఫ్ గా ఉంటాయి. గంటల తరబడి ఫుల్ సౌండ్స్ ని, మ్యూజిక్ లేదా సాంగ్స్ వినకూడదు, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. చెవులకు రెస్ట్ ఇవ్వాలి. ఒకవేళ వినికిడి సమస్య తలెత్తితే, ఆడియోలజిస్ట్ ( వినికిడి నిపుణులు ) చెప్పినట్లు ఇయర్ రింగ్స్ హెయిర్ వాడితే కొంచెం బెటర్.
బయట సౌండ్స్ వినిపించకుండా ఉండాలని వాల్యూమ్ పెంచుతారు. నాయిస్ – క్యాన్సలింగ్ హెడ్ ఫోన్స్ వాడితే బయట శబ్దాలు తగ్గిపోతాయి. ఇప్పుడు తక్కువ సౌండ్ తోనే పాటలు వినొచ్చు. ఇయర్ బడ్స్ డైరెక్ట్ గా చెవిలోకి సౌండ్ పంపిస్తాయి. కానీ హెడ్ ఫోన్స్ అలా కాదు. సౌండ్ చెవి బయట నుంచి వస్తుంది. అందుకే ఇయర్ బడ్స్ కంటే హెడ్ ఫోన్స్ కొంచెం సేఫ్.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది