Foot Pain : నిత్యం నడిచే పాదాలు నొప్పి వస్తున్నాయా.? అయితే ప్రమాదంలో పడినట్లే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Foot Pain : నిత్యం నడిచే పాదాలు నొప్పి వస్తున్నాయా.? అయితే ప్రమాదంలో పడినట్లే…

Foot Pain : ప్రస్తుతం చాలామందికి పాదాల నొప్పి, మడమల నొప్పి వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి. వీటికి కారణాలు శరీరంలో పోషకాలు లేకపోవడం, ఒత్తిడి, కండరాలు గాయపడటం లాంటివి ఈ పాదాల నొప్పికి కారణం అవుతాయి. చాలామంది మహిళలు పాదాలనొప్పి అలాగే కండరాల వాపు అధికంగా ఉండడం వలన ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ లాంటి పోషకాలు లోపం వలన […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2023,1:00 pm

Foot Pain : ప్రస్తుతం చాలామందికి పాదాల నొప్పి, మడమల నొప్పి వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి. వీటికి కారణాలు శరీరంలో పోషకాలు లేకపోవడం, ఒత్తిడి, కండరాలు గాయపడటం లాంటివి ఈ పాదాల నొప్పికి కారణం అవుతాయి. చాలామంది మహిళలు పాదాలనొప్పి అలాగే కండరాల వాపు అధికంగా ఉండడం వలన ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ లాంటి పోషకాలు లోపం వలన ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు ఇంట్లో ఉండే కొన్ని హోమ్ రెమిడీస్ తో నివారించవచ్చు.

మనలో చాలామందికి నడుస్తున్నప్పుడు పాదాల నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాలి మనం దగ్గర వచ్చే నొప్పిని అస్సలు భరించలేం… అలాంటి ఇబ్బందిని కొన్ని సహజమైన పద్ధతులు శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.. మనం ధరించే చెప్పులు కానీ షూ కానీ లైట్ వెయిట్ గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు షూ వేసుకొని ఉండేవారికి పాదాలు కొన్నిసార్లు బొబ్బలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణం సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ నొప్పులను ఆవాలు చక్కగా నివారిస్తుంది. పాదాల మంటను తగ్గిస్తుంది. ఒక గుప్పెడు ఆవాలను మెత్తగా పేస్ట్ చేసి ఒక అర బకేట్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ నీటిలో మీ పాదాలను ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత బయటకు తీసి ఒక పొడి టవల్తో తుడవండి.

Are the feet that walk forever but are in danger

Foot Pain : నిత్యం నడిచే పాదాలు నొప్పి వస్తున్నాయా.? అయితే ప్రమాదంలో పడినట్లే…

ఇలా చేస్తే మీ పాదాలనొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది. ఒక చైర్ లో కూర్చుని కాళ్ళను బాగా చాపి పాదాలు నేలకు అధిపి ఉంచండి. అలా నిమిషం పాటు ఉండి మళ్లీ కాసేపు నార్మల్ పొజిషన్లో కూర్చోండి. అలా రోజుకి ఐదుసార్లు అంతకంటే ఎక్కువగా చేస్తూ ఉంటే మీ పాదాల నొప్పి కంట్రోల్ అవుతుంది. లవంగం లోని నువ్వుల నూనె మిక్స్ చేసి మీ పాదాలకు మసాజ్ చేయండి. పాదాల నొప్పిని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇలా రోజుల మూడు సార్లు చేస్తూ ఉండండి. ఫలితం నీకు తప్పకుండా తెలుస్తుంది. ఏదైనా ప్లాస్టిక్ కవర్లో కానీ కొంత ఐస్ ని తీసుకొని పాదాలపై మసాజ్ చేయండి. ఇలా చేస్తే పాదాల వాపు తగ్గిపోతుంది. అయితే ఈ ఐస్ మసాజ్ ను ఐదు నిమిషాలకు నుంచి ఎక్కువగా చేయకండి.

ఎందుకంటే ఐస్ ని నరాలను స్కిన్ ను డామేజ్ చేస్తుంది. పాదాలను ఐదు నిమిషాల పాటు చల్లనీటిలో టిప్ చేయండి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో డిప్ చేయండి. ఇలా చేయడం వల్ల పాదాల రక్తనాళాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు పాదాల నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాలతో మీ పాదాల నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది