Hair Tips : దీన్ని మీ జుట్టుకి ట్రై చేశారంటే…. వెంట్రుకలు రావడమే కాకుండా దృఢంగా, పొడవుగా పెరుగుతాయట. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : దీన్ని మీ జుట్టుకి ట్రై చేశారంటే…. వెంట్రుకలు రావడమే కాకుండా దృఢంగా, పొడవుగా పెరుగుతాయట.

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2022,3:00 pm

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చు లేదా సరియైన పోషణ అందక కావచ్చు. ఈ సమస్య నీ కంట్రోల్ చేసుకోవడానికి మనం వివిధ రకాల నూనెలను, హెయిర్ ప్యాక్స్ ని ఉపయోగిస్తాము. జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవాలంటే అసలు ముందు జుట్టు ఎందుకు రాలుతుందనే కారణాలను కనుక్కోవాలి. పైనుంచి ఎన్ని పూసిన జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుంటే జుట్టు రాలుతూనే ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి మనం ముందుగా జుట్టుకు కావాల్సిన పోషకాలలు సరియైన మోతాదులో అందిస్తూ ఉండాలి. హెయిర్ ప్యాక్లను ఉపయోగిస్తూ జుట్టుకు కావాల్సిన బలాన్ని అందించే ఆహారం తీసుకున్నట్లయితే ఈ సమస్య తగ్గుముఖం పట్టవచ్చు. ఈ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.

నాలుగు లేదా ఐదు మందార ఆకులు లేదా మందార పూలను తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మందార ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో ఉపయోగపడతాయి. మందార ఆకులను జుట్టుకి ఉపయోగించడం వల్ల జుట్టు సిల్కీలా మెరుస్తుంది. ఆ తరువాత రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు మన జుట్టుకు కావలసిన పోషణను అందించి జుట్టు దృఢంగా ,పొడవుగా పెరిగేలా సహాయపడతాయి. వెల్లుల్లిలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషన్ను అందజేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడువుగా పెరిగేలా సహాయపడతాయి.

Hair Tips hair will not fall out but it will grow strong and long

Hair Tips hair will not fall out but it will grow strong and long

ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని దానిపైన ఉన్న పొరనే తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సల్ఫర్ ఉండడం వల్ల జుట్టు రాలటాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్చటి క్లాత్ సహాయంతో రసాన్ని వేరు చేసి జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేశారంటే మీ జుట్టు హెల్దీగా పొడవుగా పెరుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది