Hair Tips : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా… అయితే ఇది ట్రై చేసి చూడండి… 7 రోజులలో కొత్త జుట్టు రావడం ఖాయం..
Hair Tips : ప్రస్తుతం రోజువారి విధానంలో జుట్టు రాలే సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్యలకు ఎన్నో రకాల క్రీములు, షాంపూలను వాడి వాడి విసిగిపోతున్నారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అయితే అలా వాడి విసిగిపోయిన వారికి ఇప్పుడు ఈ చిట్కాతో జుట్టు తిరిగి పొందడం ఎలాగో చూద్దాం. ఈ మిశ్రమం ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా అర గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకు జుట్టుకి సిరప్ లా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకులో బేటా కెరిటిన్ ఉంటుంది. ఇది జుట్టు కుదుర్లను స్ట్రాంగ్ గా చేస్తుంది. ఈ కరివేపాకు జుట్టు రాలే సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా కలమంద. ఈ కలమంద జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి. పొడుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా దురద, ఇన్ఫెక్షన్స్ ,చుండ్రు లాంటి ఇబ్బందులు నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందార పువ్వులు. ఈ పువ్వులు జుట్టు ఒత్తుగా, సిల్కీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మందార ఆకులు. ఈ మందార ఆకులలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడంలో ఉపయోగపడుతుంది. ఆకులు జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ గా చేస్తాయి. అలాగే జుట్టు చివర్లు పగిలిపోవడం లాంటి, సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Hair Tips : ఈ మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ముందుగా కరివేపాకును అరగుప్పెడు, మందార ఆకులు గుప్పెడు, కలమంద ఒక మట్ట తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మందార పువ్వులు నాలుగు, వీటన్నిటినీ కలిపి వీటిలో మూడు చెంచాల నీటిని వేసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరి నూనెను కలిపి తలకి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత కుంకుడకాయలతో తలస్నానం చేయాలి. ఇలా ఏడు రోజులు పాటు చేస్తూ ఉంటే మీ జుట్టు రాలడం ఆగిపోయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, స్మూత్ గా పెరుగుతుంది.