Hair Tips : ఈ నూనె ఒక్కసారి రాసారంటే.. జుట్టులో తేడా చూసి మీరే అవాక్కయిపోతారు…!
Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం వాతావరణంలో పెరిగే కాలుష్యం, సరైనా ఆహారం తీసుకోకపోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు ఒత్తుగా ఉన్నవారికి కూడా జుట్టు మొత్తం సన్నగా అయిపోతుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. వీటిలో ఉండే కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ఈ నూనెను కనుక రాస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో రెండు స్పూన్ల ఎండు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా కాపాడుతుంది. ఉసిరికాయలు సీజన్ కానప్పుడు ఎండబెట్టిన కాయలను ఆయుర్వేద షాప్ లలో లభిస్తాయి. తర్వాత రెండు స్పూన్ల కలోంజి విత్తనాలు తీసుకోవాలి. కలోంజి విత్తనాలు జుట్టు రాలడం తగ్గించి కొత్త జుట్టు రాలడంతో సహాయపడుతుంది. అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత దీనిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకొని ఉసిరికాయ ముక్కలు రంగు మారేవరకు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను ఒకసారి తయారు చేసుకుని నెల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ నూనె రాసుకునే ముందు గోరువెచ్చగా వేడి చేసుకుని జుట్టు కుదురుల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాలు పాటు స్మూత్ గా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా పెరిగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నూనె రాసిన తర్వాత ఒక గంట ఉండి తర్వాత ఏదైనా షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.