Health benefits : చిల్లోజా గురించి ఎప్పుడైనా విన్నారా…? డ్రై ఫ్రూట్స్ కన్నా అధిక ప్రయోజనాలు వీటిలో ఉన్నాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health benefits : చిల్లోజా గురించి ఎప్పుడైనా విన్నారా…? డ్రై ఫ్రూట్స్ కన్నా అధిక ప్రయోజనాలు వీటిలో ఉన్నాయి…

 Authored By prabhas | The Telugu News | Updated on :1 October 2022,5:00 pm

Health Tips :మనం ఎక్కువగా ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ ని తింటూ ఉంటాం… అయితే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కన్నా అధిక ప్రయోజనాలు ఉన్న ఈ చిల్లోజా గింజల గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. అయితే వీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపులు తెలియజేస్తున్నారు.
ఈ చిల్లోజా కి మరొక పేరు ఫైన్ నట్.ఈ చిల్లోజా గింజలతో బాదం, జీడిపప్పు కన్న దీనిలో అధిక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో పాటు దాని ఆయిల్ నీ అనేక ఆయుర్వేద మందులలో వినియోగిస్తూ ఉంటారు దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ చిల్లోజా గింజలు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి దాదాపు 2.5 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. దీనిలో ఉండే విత్తనాలనే డ్రైఫ్రూట్ గా వాడుతుంటారు. ఈ గింజలను ఎండబెట్టడం వలన అవి నల్లగా అవుతూ ఉంటాయి. దానిపైన ఉండే పొరను తీసివేస్తే తెల్లటి రంగు కనపడుతుంది. ఇవి రుచి తీయగా ఉంటాయి.ఈ డ్రై ఫ్రూట్స్ ఉబ్బసం దగ్గు లాంటి సమస్యలు ఉన్నవాళ్ళకి తప్పనిసరిగా వీటిని ఉపయోగించాలి. 5 టు 10 గ్రాములు చిల్లోజా విత్తనాలను పొడిచేసి తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే దగ్గు, ఉబ్బసం సమస్యల నుండి బయటపడవచ్చు.చలికాలంలో ఈ గింజలను తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

have you ever heard about chilloja have you ever heard about chiloja it has more benefits than dry fruits

have you ever heard about chilloja have you ever heard about chiloja it has more benefits than dry fruits

శరీరానికి వేడి రావాలంటే ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వలన శరీరంలోని ఎముకలు బలంగా మారుతాయి.చలికాలంలో మిగతా డ్రై ఫ్రూట్స్ లాగే చిల్లోజా ను నిత్యము రెండు మూడు తీసుకుంటే శరీరంలో వేడిని కలిగిస్తుంది. దాని ద్వారా దగ్గు, జలుబులు సమస్యల నుంచి రక్షిస్తుంది. అలాగే దీని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది.మీకు శరీరంలో బలహీనత ఉన్నట్లయితే నిత్యము అయిదారు చిల్లోజ విత్తనాలను తీసుకోవాలి. ఈ గింజలను పిల్లలకి కూడా పెట్టవచ్చు. వీటితోపాటు వీటి ఆయిల్ నీ కూడా అప్లై చేయడం వలన కీళ్ల నొప్పుల నుండి బయటపడతారు. అలాగే బాడీపెయిన్స్ నుంచి ఉపశనం కలుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది