Health Tips : పసుపు కలిపిన పాలు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే?
Health Tips : పాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అందుకే పాలు తాగాలని పిల్లలకు చెబుతుంటారు పేరెంట్స్. చిన్నతనంలో సరిగా పాలు తాగకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్ది పోషకాహార సమస్యలు వస్తుంటాయి. విటమిన్ లోపం కారణంగా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. పాలల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివలన ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందడంతో శక్తి పెరుగుతుంది. సాధారణంగా కొందరు పిల్లలు పాలు తాగేందుకు మారం చేస్తుంటారు. ఇలా చేయడం వలన వారి మెదడు ఎదుగుదలలో కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ టైంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. అందుకే పాలల్లో పసుపు వేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలల్లో పసుపు వేసుకుని ప్రతిరోజూ తాగితే మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. రోజు మూడు గ్లాసుల పసుపు పాలు తాగితే వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. పూర్వం ఏదైనా వైరల్, సీజనల్ వ్యాధులు ప్రబల్లో రోజుల్లో పాలల్లో పసుపు వేసి తాగించేవారట. దీంతో పెద్దగా వ్యాధులు వ్యాప్తి చెందేవి కాదని తెలిసింది. దగ్గు, కఫం, జలుబుతో బాధపడేవారు పసుపు కలిపిన పాలు తాగితే ఉపశమనం పొందవచ్చు.
Health Tips : పాలల్లో పసుపు వేసుకుని తాగితే కలిగే ప్రయోజనాలు
అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. అందుకే కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావని తెలుస్తోంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది. పసుపు పాలలో కాలేయంలో రక్తప్రసరణను మెరుగు పరిచి లింఫోటిక్ సిస్టమ్‌ను కూడా శుద్ధి పరుస్తాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని ఆరికడుతుంది. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ త్వరితగతిన రెట్టింపు కాకుండా ఉంచే గుణాలు పసుపు కలిగి ఉంటుంది.