Diabetes : ఉల్లిపాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఉల్లిపాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,5:30 pm

Diabetes : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధ గుణాలు, పోషకాలు వలన దానిని అలా అంటారు. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సల్ఫర్ లాంటివి ఉంటాయి. ఉల్లిని ప్రతి ఒక్కరు ఆహారంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ లేనిది ఏ కూర చేయడం జరగని పని. కంట్లో నుంచి నీరు వస్తున్నా సరే వాటిని కట్ చేసుకొని కూరల్లో వేస్తాం. అలాంటి ఉల్లిపాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే సల్ఫర్ క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. ఉల్లిపాయలోని లక్షణాలు రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. అలాగే దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్ నివారించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. పచ్చి ఉల్లిపాయను తింటే నోటిలో ఉండే కీటకాలు, క్రిములు చనిపోతాయి. ఉల్లిపాయ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో రక్త పోటును నివారిస్తుంది. ఉల్లిపాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు ఉల్లిపాయలను తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

Health Benefits of onions to control the Diabetes

Health Benefits of onions to control the Diabetes

అయితే తాజా పరిశోధనలో ఉల్లిపాయ డయాబెటిస్ రోగులకు మంచి ఆహారమని తెలిపారు. రోజు ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెంట్ ఫార్మిన్ తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ 50% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇంకా ఈ ప్రయోగం ఎలుకల్లోనే జరిగిందని మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేము అని అన్నారు. మరోవైపు ఈ అధ్యయనంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయలు చాలా ఎక్కువగా తింటారు. అలాంటప్పుడు భారత్ లోనే మధుమేహగ్రస్తులు ఎందుకు ఎక్కువగా ఉన్నారని ప్రశ్నించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది