Health Benefits : వామ్మో… తులసి ఆకుల వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వామ్మో… తులసి ఆకుల వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Health Benefits : ఇందు సాంప్రదాయాలలో ఆడవారు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవత తులసమ్మ. ఈ తులసి మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ తులసి ఆకులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ తులసి మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇటీవల లో ప్రతి ఇంట్లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఆకులు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో వచ్చే జలుబు, దగ్గు ,డయేరియా లాంటి వ్యాధులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 October 2022,6:30 am

Health Benefits : ఇందు సాంప్రదాయాలలో ఆడవారు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవత తులసమ్మ. ఈ తులసి మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ తులసి ఆకులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ తులసి మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇటీవల లో ప్రతి ఇంట్లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఆకులు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో వచ్చే జలుబు, దగ్గు ,డయేరియా లాంటి వ్యాధులు ఈ తులసి ఆకులు వలన తగ్గుతాయి. అదేవిధంగా ఈ తులసి మొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణు చివర్లో శంకరుడు ఉంటారని శాస్త్ర లు తెలుపుతున్నాయి. దీని మూలంగానే దేవుడి గుడిలలో తీర్థ ప్రసాదాలలో ఈ తులసి ఆకులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.ఈ తులసి మొక్క ఐదు రకాలుగా ఉంటాయి.

కానీ ప్రస్తుతం కృష్ణ తులసి, లక్ష్మి తులసిని బాగా ఉపయోగిస్తున్నారు. ఈ తులసి మొక్క వలన ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు. జలుబు, దగ్గు, నోటిపూత లాంటి వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది నీ తులసి. సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే డయేరియా, జ్వరం, వాంతులు, దగ్గు, జలుబు లాంటి వ్యాధులు ఈ తులసి మొక్క ఉపసమనం కలిగేలా చేస్తుంది. ఈ తులసి ఆకులతో తయారుచేసే కషాయం తీసుకోవడం వలన తలనొప్పి లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. పంటికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ తులసి ఆకులను పొడిలా చేసుకుని దంతాలను క్లీన్ చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. తులసి ఆకుల పేస్టు ఆవనూనెలో కలిపి దాన్ని దంతాలను క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన క్షయతో పాటు నోటీ చెడు వాసన కూడా పోతుంది. ఈ తులసి ఆకుల వలన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వర్షాకాలంలో డెంగ్యూ లాంటి జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది.

health benefits of tulsi leaves

health benefits of tulsi leaves

కావున అటువంటి సమయంలో లేత తులసి ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తీసుకోవడం వలన ఆ జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ జ్వరం తీవ్రంగా ఉంటే ఈ ఆకులను అర లీటర్ నీటిలో వేసి యాలకుల పొడిని కలిపి మరిగించి కషాయం లాగా చేసి త్రాగాలి. ఈ కషాయాన్ని మూడు గంటలకు ఒకసారి త్రాగవచ్చు. అస్తమ వంటి జబ్బులను నివారించడంలో తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నోట్లో వేసుకొని నమలడం వలన జలుబు వంటి వ్యాధులనుండి రక్షిస్తుంది. యాలకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరుకోవాలి ఇలా తయారు చేసుకున్న దానిని ధాన్యం నిలువచేసే ప్రదేశంలో తులసి ఆకులను ఉంచడం వలన ధాన్యం పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఈ ఆకుల్ని తీసుకోవడం మధుమేహం నుంచి బయటపడవచ్చు. అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి.

ఈ తులసి కషాయంలో తేనెను కలిపి త్రాగడం వలన పైత్యం నుంచి ఉపసమనం కలుగుతుంది. అలాగే మూత్ర విసర్జన టైం లో మంటతో ఇబ్బంది పడేవారు ఈ తులసి ఆకుల రసంలో పాలు చక్కెర కలిపి త్రాగడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ ఈ తులసి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసి యొక్క వాసన చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఈ తులసి వాసన వ్యాపించినంత దూరం కూడా పాములు, దోమలు, ఈగలు దరిచేరవు. ఈ ఆకులను నూరి ఫేస్ కి పెట్టుకుంటే మొటిమలు ,మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా తులసి మొక్క మనకి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. తులసి ఆకులు నీటిలో ఉండే ప్రోలోసిస్ ను నివారిస్తుంది. దీనిని వాడటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది