Health Benefits : మొలకలు తినలేని వాళ్లు. ఈ ఇడ్లీ తీసుకుంటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది..
Health Benefits : మొలకలు లలో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే చాలామంది ఈ మొలకలు తినడానికి అసలు ఇష్టపడరు. అలాంటివాళ్లు ఈ మొలకలు ఇడ్లీ రూపంలో తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరియు పోషకాలు కూడా అన్ని అందుతాయి. ఇడ్లీ రూపంలో తీసుకోవడం వలన కొన్ని పోషకాలు కోల్పోవచ్చు కానీ మొలకల్ని ఈజీగా తినవచ్చు.. అంటే కొన్ని పోషకాలు అయినా ఇడ్లీ రూపంలో అందుతాయి కదా..
Health Benefits : ఇడ్లీ ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం…
దీనికోసం ముందుగా మొలకెత్తిన పెసలు అరకప్పు ఒక కప్పు, పెరుగు, అల్లం ముక్కలు, ఓట్స్ అరకప్పు, మొలకెత్తిన శనగలు అరకప్పు, అలాగే పచ్చిమిర్చి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు తయారు చేద్దాం. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీ పిండిలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పిండిని ఇడ్లీ పాత్రలో మీగడ అప్లై చేసి వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఇడ్లీలను తీసుకొని ఎవరైనా ఈ రకం ఇడ్లీని తీసుకోవడం వలన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీని ద్వారా పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. అలాగే దీనిలోకి చెట్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఖర్జూరం, పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు, కొద్దిగా పెరుగు, కొద్దిగా పల్లీలు ఇలా ఇవన్నీ వేసుకొని చట్నీలా పట్టుకోవాలి. ఇలా చేసుకుంటే సులభంగా కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. కావాలనుకుంటే దీనికి కొద్దిగా మీగడ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరేపాకు, మిర్చి వేసి పోపు పెట్టుకోవచ్చు.ఇలా ఇడ్లీని చేసుకొని తీసుకోవడం వలన గొప్ప విలువలతో కూడిన మరియు ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.అయితే ఇలాంటి ఇడ్లిని రోజు తీసుకోవడం వలన కూడా అన్ని పోషకాలు అందవు కనుక ఎప్పుడైనా మొలకలు తినలేని టైంలో ఈ విధంగా చేసుకొని తీసుకోవచ్చు. రోజు తీసుకునే దోస,పూరి ,ఇడ్లీ కంటే ఇడ్లీ వలన చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ ఇడ్లీ నీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు తినవచ్చు.