Health Benefits : కిడ్నీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసే సొరకాయ జ్యూస్.. 15 రోజులకు ఒకసారైనా తాగండి!
Health Benefits : శరీర అవయవాలని శుభ్రపరిచే అతి ముఖ్యమైన శరీరం బాగం కాలేయం. అయితే మన శరీరంలో ఉండే కాలేయం ప్రతిరోజూ అనేక వందల పనులను చేస్తుంటుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ముఖ్యం అనే రకాల చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. కాలేయం దెబ్బ తినడానికి ముఖ్య కారణం… వైద్యుల సలహా లేకుండా మనం వాడే అనేక రకాల మందులు, మాత్రలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అధికంగా మద్యం తాగడం, జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి, మానసిక ఆందోళనలు శరీర ఆరోగ్యంపై కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీర్ణ వ్యవస్థలో కీలక మార్పులు ఏర్పడి శరీర వ్యవస్థ మొత్తం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. మన వంట గదిలో ఉండే కొన్ని ఆహార వస్తువులతో మన లివర్ ని శుభ్రం చేసుకోవచ్చు.
ఆ వస్తువులతో కాలేయాన్ని డీటాక్స్ చేసి ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కాలేయాన్ని శుభ్రపరచడానికి మనం ముందుగా తినాల్సింది సొరకాయ, ఆనపకాయ. సొరకాయ తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ అందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటామిన్ సి, బి కాంప్లెక్స్ వంటివి కాలేయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఫైబర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థను కాపాడుకోవచ్చు. మలబద్ధకం, గ్యాస్, మల విసర్జను సులభతరం చేస్తుంది. సొరకాయలో శరీరానికి చల్లదనాన్ని ఇఛ్చే అనేక గుణాలున్నాయి. ఆహారం జీర్ణం కావడంలో సొరకాయ చాలా బాగా సాయపడుతుంది.

Health Benefits you must drink pumpkin juice every 15 days for clean liver at home
యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. సొరకాయ వల్ల లివర్ లో వాపును తగ్గించుకోవచ్చు. అందుకే సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ శుభ్రపడుతుంది. అందుకే తరచుగా సొరకాయ జ్యూస్ ను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం 15 రోజులకు ఒక సారి అయినా సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి.సొరకాయ జ్యూస్ తయారీ విధానం… కప్పు కొత్తిమీర, కప్పు సొరకాయ ముక్కలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం నీరు కలుపుకొని జ్యూస్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పసుపు, అరచెక్క నిమ్మ రసం, కొస్త రాళ్ల ఉప్పు కలిపి పరగడుపున తాగాలి. ఇది తాగిన వెంటనే ఇంకేం తినకూడదు. దాదాపు గంట తర్వాత టిఫిన్ చేయాల్సి ఉంటుంది. ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది.