Health Tips : ఖాళీ కడుపుతో ఇది తిన్నారంటే… బరువు తగ్గడం ఖాయం…!
Health Tips : ప్రస్తుత చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది బరువును తగ్గించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తారు. అయితే బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి తరచుగా వెల్లుల్లి తినమని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈజీగా బరువు తగ్గుతారు. వెల్లుల్లి కాళీ కడుపుతో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పచ్చి వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేస్తుంది. బరువు తగ్గటం లో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి బరువు తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటుంది.
ఇది శరీరంలో శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. జీవ క్రియను పెంచి బరువను నియంత్రించే పోషకాలు ఇందులో ఉంటాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వలన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీని తీసుకోవడం వలన చాలాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తోంది. అలా అని అతిగా కూడా తినకూడదు. వెల్లుల్లి డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గటానికి ప్రతిరోజు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలి. మలబద్ధకం సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తినకూడదు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, లో బీపీ రక్తస్రావం, డయాబెటిస్ ఉన్నవారు ఈ వెల్లుల్లిని తినకూడదు. వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఇది కడుపుని చికాకు పెడుతుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు దీనిని తినకూడదు. ఇందులో ఉండే రసాయనాలు ఛాతి, కడుపులో మంటను కలిగిస్తాయి. కాబట్టి దానిని ఎక్కువగా తినకూడదు. కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.