Health Tips : చలికాలంలో ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే… ఈ డ్రింక్ త్రాగాల్సిందే…!
Health Tips : మరి కొద్ది రోజుల్లోనే శీతాకాలం మొదలు కాబోతుంది. ఈ కాలంలో చలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో జలుబు, దగ్గుల ఆస్తమా ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో ఏ పనైనా చేయాలంటే అలసట, నీరసం వస్తాయి. జలుబు వచ్చిందంటే బాడీ అంత వీక్ అయిపోయి జ్వరం తగిలినట్టుగా ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం. శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఓ డ్రింక్ సహాయపడుతుంది. ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ డ్రింక్ స్పైసి మిల్క్ అని కూడా అంటారు.
దీనిని రాత్రి నిద్రపోయే ముందు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఈ స్పైసీ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్పైసీ మిల్క్ తయారు చేసుకోవడానికి ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి. దీని తయారు చేసుకోవడానికి మనకు ఐదు పదార్థాలు కావాలి. దీనికి 200మి.లీ నెయ్యి, 300 గ్రాముల పసుపు, 50 గ్రాముల సొంటి పొడి, 25 గ్రాములు నల్ల మిరియాల పొడి 15 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి లో ఫ్లేమ్ లో వేడి చేయాలి. తర్వాత ఇందులో పసుపు వేసి మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన మసాలా పొడులు వేసుకోవాలి.
పసుపు వాసన పోయేంతవరకు దాని రంగు మారేవరకు ఈ మిశ్రమాన్ని వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. గాలి చొరబడని గాజు సీసాలో ఈ మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఒకటి స్పూన్ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగాలి. ప్రతిరోజు ఈ పాలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ ఓ నెల రోజుల పాటు తాగితే చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ స్పైసీ మిల్క్ తాగితే జలుబు, ఎలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. కావున ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఇప్పటినుంచే ఈ డ్రింక్ త్రాగమంటే ఎటువంటి సమస్యలు దరిచేరవు.