Health Tips : కాల్షియంతో ఆ సమయంలో వచ్చే సమస్యలన్నింటికీ చెక్.. అవేంటో తెలుసుకోండి
Health Tips : ప్రతి మహిళ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక భాగం. ఈ దశలో స్త్రీలో అనేక మార్పులకు లోనవుతుంది. మోనోపాజ్ 40 సంవత్సరం చివరిలో లేదా 50 సంవత్సరాల ప్రారంభంలో మొదలవుతుంది. ఈ దశ కొంతమందిలో చాలా ఏళ్లు గా ఉంటుంది. రుతుక్రమం ఆగిన మహిళల్లో చాలామందికి ఊబకాయం, గుండె జబ్బులు , మధుమేహం వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే మహిళల్లో మెనోపాజ్ సంకేతాల నుండి ఉపశమనం కలిగించే కొన్ని సహజ పద్ధతులను ఇప్పుడు చూద్దాం.అయితే మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు అనేక రుగ్మతలను ప్రేరేపిస్తాయి. వీటిని మంది ఆహారం తీసుకోవడంతో నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఈ సమయం లో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్-డి మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తుంటారు.
అయితే దీనికి మంచి నిద్ర, వ్యాయమం ఎంత అవసరమో ఆహారంలో కూడా కొన్ని మార్పులు చాలా అవసరం. మరం రోజు తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పకుండా తీసుకోవాలి. దీని వల్ల కాల్షియం, పొటోషియం అందుతుంది. బీ విటామిన్లు, ఫైబర్ బరువు పెరగకుండా చూసుకుంటాయి. సాధారణ ఆకుపచ్చ కూరగాయలు, పాలు, పెరుగు, బ్రోకలీ, బీట్రూట్, బచ్చలికూర, అరటి, సోయాబీన్, గుడ్లు, చేపలు, బాదం, జీడిపప్పు, మజ్జిగ మొదలైన వాటి నుంచి కాల్షియం పొందవచ్చు.అయితే ఎక్కువగా డైట్ లో కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా..

Health Tips of calcium and iron rich foods
Health Tips : కాల్షియంతో అన్నీ దూరం..
కండరాల బలాన్ని, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు హృదయ స్పందనను నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యక్తి శరీరంలో కాల్షియం లోపం ఉంటే, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కండరాల తిమ్మిరి, గోర్లు బలహీనంగా ఉండటం, తలనొప్పి, డిప్రెషన్, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. రుతుక్రమం ఆగిన మహిళల్లో డ్రై నెస్ అనేది ఒక సాధారణ సమస్య. తగినంత నీరు తాగటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.అలాగే మోనోపాజ్ సమయంలో స్త్రీలు ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందడం వల్ల యముకలు బలంగా తయరవుతాయి. వాల్ నట్లు, గుమ్మడి గింజలు, బాదం ఇలా సహజమైన ఫుడ్ తీసుకుంటూ.. మసాలాలు, నాన్ వెజ్ జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటే ఆ సమయంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు.