Health Tips : పాలు త్రాగేటప్పుడు పొరపాటున కూడా వీటిని తినకండి .. తిన్నారా ఇక అంతే !
Health Tips : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలామంది సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయసులోని వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యం చక్కగా ఉంటే ఏ పనినైనా చేయగలుగుతాం. అయితే పాలు త్రాగే ముందు లేదా తర్వాత పలు పదార్థాలను తీసుకుంటారు. అది వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్థాల కలయిక వలన శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఉదయం పాలను త్రాగుతారు.
అయితే పాలు త్రాగిన తర్వాత పొరపాటున కూడా ఈ పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పాలు త్రాగిన వెంటనే ముల్లంగిని తినకూడదు. దీనివలన జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. అందుకే పాలు త్రాగిన తర్వాత ముల్లంగిని అస్సలు తినకూడదు. అలాగే పాలు తాగిన తర్వాత నిమ్మరసం లేదా నిమ్మకాయతో చేసిన ఏవైనా పదార్థాలను అస్సలు తినకూడదు. తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలు తాగిన వెంటనే నిమ్మకాయతో చేసిన పదార్థాలను తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి. నిమ్మకాయతో చేసిన పదార్థాలను తిన్న తర్వాత కూడా పాలు త్రాగకూడదు.
పాలు తాగిన వెంటనే సిట్రిక్ ఫ్రూట్స్ తినకూడదు. పాలు తాగిన వెంటనే పుల్లటి పండ్లను తీసుకోవడం వలన క్యాల్షియం పండ్ల లో ఉండే ఎంజైమ్లను గ్రహిస్తుంది. దీనివలన శరీరానికి పోషక ఆహారం కూడా దొరకదు. అందుకే పాలు తాగిన తర్వాత పైనాపిల్, నారింజ వంటి పుల్లటి పండ్లు అస్సలు తినకూడదు. అలాగే పాలు తాగే ముందు లేదా తర్వాత చేపలు అస్సలు తినకూడదు. దీని వలన చర్మ సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది. అందుకే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదు. తినాలనుకుంటే పాలు తాగే ముందు తాగిన తర్వాత గంట గ్యాప్ ఉండాలి.