Health Tips : మాంసం ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.. లేదంటే ప్రమాదం తప్పదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : మాంసం ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.. లేదంటే ప్రమాదం తప్పదు..!!

Health Tips : చాలామంది మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. దాని పేరు చెప్తే ఆకలి పుడుతుంది. అంత ఇష్టంగా తింటూ ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసిన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పోషకాలు అందడానికి మాంసాహారం మంచి ఎంపిక.. అలాగే మనలో కొంతమంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. అయితే ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యనాకి మంచిది. మితిమీరి తీసుకుంటే ఎంత […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 March 2023,8:00 am

Health Tips : చాలామంది మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. దాని పేరు చెప్తే ఆకలి పుడుతుంది. అంత ఇష్టంగా తింటూ ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసిన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పోషకాలు అందడానికి మాంసాహారం మంచి ఎంపిక.. అలాగే మనలో కొంతమంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. అయితే ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యనాకి మంచిది. మితిమీరి తీసుకుంటే ఎంత మంచిదేనా అది విషయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చికెన్, మటన్ లాంటివి కూడా పరిమితంగానే తినాలని పోషకాహారాన్ని నిపుణులు తెలుపుతున్నారు.

Health Tips People who eat a lot of meat should know these things

Health Tips People who eat a lot of meat should know these things

ప్రధానంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే దానివలన కలిగే మంచి కన్నా చెడు ఎక్కువగా పెరుగుతుందని వారు తెలిపారు.మాంసం ఎక్కువగా వాడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీట్ ఎక్కువగా వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం.. గుండె ఆరోగ్యం ఎముకలు: సాధారణంగా మాంసాహారం ఎముకల ఆరోగ్యాన్ని ఉపయోగపడుతుంది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తీసుకోవాలి. అలాగే మటన్ అధికంగా తింటే బోన్స్ పై సైడ్ ఎఫెక్ట్స్ కూడా పడుతుంది. ఎందుకంటే దీన్లో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని

పెంచడంతోపాటు గుండె నాళాలను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.దాని ఫలితంగా గుండె జబ్బులను బారిన పడే అవకాశం ఉందని అదే సమయంలో ఈ ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.క్యాల్షియం లెవెల్స్: ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జంతువుల నుండి వచ్చే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే మాంసాహారం తీసుకునే సాయి అధికమైతే ఎముకలు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అలాగే రెడ్ మీట్లో పాస్పరస్ ,క్యాల్షియం నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికమయ్యేలా చేస్తుంది.

Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..! | Health  news eating too much meat can increase these health problems | TV9 Telugu

దీని ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారిపోతూ ఉంటుంది. రక్తం ఆమ్లత్వం: రెడ్ మీట్ అధికంగా తినే వారిరక్తంలో ఆమ్లత్వం అధికమవుతుంది. దీని వలన కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించలేదు. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ద్రవ ప్రభావం పడి అవి బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. రక్తంలో ఆమ్లత్వం పెరిగితే ఇది ఎముకల నుండి కాల్షియం తొలగిపోవడానికి దోహదపడుతుంది.. మాంసానికి బదులుగా: మాంసాహారానికి బదులుగా కొన్ని రూపాల్లో ప్రోటీన్ ని తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పాల లాంటి డైరీ పదార్థాలు చికెన్ ,ప్రోటీన్ చేపలు డైట్ లో చేర్చుకోవాలి. వీటితోపాటు కూరగాయలు పండ్లు త్రుణదాన్యాలతో పాటు బ్యాలెన్స్ డైట్ లను తీసుకోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది