Betel Leaves : తమలపాకులు తింటే, మీ శరీరంలో ఓ అద్భుతం జరుగుతుంది… అదేంటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Betel Leaves : తమలపాకులు తింటే, మీ శరీరంలో ఓ అద్భుతం జరుగుతుంది... అదేంటో తెలుసా...?
Betel Leaves : తమలపాకులు మనందరికీ తెలిసినవే. ఈ తమలపాకులు భోజనం తర్వాత పాన్ పరాగ్ లా వేసుకుంటారు. ఇలా పాన్ లాగా వేసుకోవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవుతుందని నమ్ముతారు. అయితే, తమలపాకులvవలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు వలన జీర్ణ క్రియ,అజీర్ణం, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ద్వారా నోటి ఇన్ఫెక్షన్ తగ్గించి, నోటిని శుభ్రపరుస్తుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను బలపరచడంలో కూడా ఈ తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సమయంలో తమలపాకులు తింటే శరీరంలోని టాక్సిన్ ను బయటకి వెళ్లేలా చేసి శరీరంను శుద్ధి చేస్తుంది.మనం భోజనం తర్వాత తమలపాకులు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. తమలపాకులు మన సాంప్రదాయ జీవన విధానంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. తమలపాకుని నమలడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ తమలపాకు కేవలం సాంప్రదాయపు అలవాటే కాదు శరీరానికి రక్షణగా కూడా పనిచేస్తుంది. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తమలపాకుల గురించి తెలుసుకుందాం….
జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం :
తమలపాకులను జీర్ణవ్యవస్థ కోసం చాలా బాగా ఉపకరిస్తుంది. మనం తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం చేస్తుంది. భోజనం తర్వాత తమలపాకును తింటే జీర్ణవ్యవస్థ పై మంచి ప్రభావం చూపుతుంది. తమలపాకు వలన అజీర్ణం,వాపు వంటి సమస్యలు నుంచి ఉపశమనం కలిగించడంలో తమలపాకు కీలక పాత్ర పోషిస్తాయి.
పేగుల ఆరోగ్యం :
తమలపాకులు నమలడం వల్ల పేగులు ఆరోగ్యంగా తయారవుతాయి. తమలపాకు లో ఉండే సహజ గుణాలు పేగులను శుభ్రం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుటకు సులభమైన పద్ధతి. శుభ్రమైన పేగులను ఉంచడంలో సహాయపడుతుంది.
ఎసిడిటీ,కడుపుబ్బరం :
తమలపాకులను నమలడం వల్ల రాత్రి వేళలో వచ్చే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అంటే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది కడుపులోని అధికారం ఉత్పత్తి చేయడానికి నియంత్రించి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. రాత్రి భోజనం తర్వాత తమలపాకును నమ్ముటం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది.
నోటి ఆరోగ్యం :
తమలపాకులు యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నోటి ఇన్ఫెక్షన్ నివారించి,నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన తొలగించడంలో కూడా ఇవి సహాయపడతాయి. నోటి ని శుభ్రపరచుటకు తమలపాకులు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. అందువల్ల తమలపాకులు నమలటం నోటి ఆరోగ్యానికి మంచి చిట్కా.
మానసిక ఆరోగ్యం :
తమలపాకులు నమిలితే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తమలపాకు వలన మానసిక ఒత్తిడి తగ్గి,ప్రశాంతత కలుగుతుంది. రాత్రి సమయంలో తమలపాకులు తింటే నరాలు రిలాక్స్ అవుతాయి. తమలపాకులు శరీరంలో టాక్సీన్లు బయటికి పంపడానికి సహాయపడతాయి. ఇవి శరీర శుద్ధి ప్రక్రియలో సహాయకరంగా ఉంటాయి. గుండె,శ్వాసకోశ సమస్యలు తమలపాకులకు సహజ చికిత్సగా పనిచేస్తాయి. కాబట్టి తమలపాకులను భోజనం తర్వాత తప్పనిసరిగా నమ్మడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.