Andu Korralu : అండు కొర్రలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే…!
Andu Korralu : ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ఆహార ధాన్యాలు సిరి ధాన్యాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు అవి అరికలు, ఊదలు, సామేలు, అండ్ కొర్రలు వీటిలో 8 నుండి 12% వరకు పీచు పదార్థం ఉంటుంది. ఇవి పూర్తిగా సేంద్రియమైనవి.. సిరి ధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగకారకాలను శరీరం నుండి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఈ అండు కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఆండు కొర్రలు ఒక మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.వీటిలో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం మరియు భాస్వరంతో విటమిన్లు అధిక పాలలో ఉంటాయి. కొర్రలు గడ్డి జాతికి చెందినవి.
చిన్న మొక్కలు ఇవి సన్నగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120 నుండి 200 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. ఈ కంకులు జుట్టును కలిగి సుమారు 5 నుండి 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అండు కొర్రగింజలు చిన్నగా సుమారు రెండు మిల్లీమీటర్లు ఉంటాయి. మామూలుగా మనకు పొలం గట్ల వెంట కనిపిస్తూ ఉంటాయి. కొర్ర మొక్కను దంచి దులిపితే కొర్రలు కంకి నుండి వేరవుతాయి. మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధంగా కొర్రలను వాడుతారు. కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి కోర్రలు తినడం చాలా మంచిదని పెద్దలు చెప్తారు. దులిపిన కొర్రలను జల్లెడ పట్టి తర్వాత వంటకు ఉపయోగిస్తారు.
ఆధునిక కాలంలో పాలిష్ చేసిన బియ్యం పురుగుమందులు కొట్టిన కూరగాయలు పండ్లు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. తద్వారా పలు అనారోగ్య సమస్యలు తెచ్చుకొని బాధపడుతున్నాం.. అందుకే మన పెద్దలు చిరు ధాన్యాలు తినమని సలహా ఇస్తున్నారు. వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొర్రలు చాలా ముఖ్యమైనవి ఇందులోనే ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచిది.