Hair Tips : ఇది ఒక్కటి మీరు వాడే షాంపూ లో కలిపి వాడి చూడండి .. మీ జుట్టు వద్దన్నా గడ్డిలా పెరుగుతుంది..!
Hair Tips : ప్రస్తుతం చాలామందిలో ఈ జుట్టు రాలే సమస్య తో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఈ సమస్యలు రావడానికి కారణాలు వాతావరణం పొల్యూషన్ అయ్యుండొచ్చు. మనం తీసుకునే ఆహారం వలన కూడా అయ్యుండొచ్చు.. కారణాలు ఏదైనా అవ్వచ్చు కానీ ఒకప్పుడు కాలంలో జుట్టు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా సీకాయ, కుంకుడుకాయ లాంటివి వాడేవారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో షాంపూ తప్ప ఇంకేమి వాడడం లేదు.. అయితే అలాంటి వారికి ఇప్పుడు జుట్టు ఊడకుండా రక్షించుకోవడం కోసం షాంపూలో దీనిని ఒక్కదాన్ని కలిపి పాడడం వలన జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు సమస్య తగ్గిపోయి జుట్టు నిగనిగలాడుతూ నల్లగా మారుతుంది..
ఈ టిప్ కోసం మనం ఒక చిన్న కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తర్వాత నీరు పోసి ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఆ నానిన బియ్యాన్ని నుంచి నీటిని తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ కూడా వేయాలి. తర్వాత ఒక స్పూను తేనె కూడా వాడాలి. అలాగే మీరు వాడే ఏదైనా షాంపూను మీ జుట్టుకి సరిపడినంత తీసుకోవాలి. హెర్బల్ షాంపు అయితే ఇంకా చాలా మేలు చేస్తుంది. తర్వాత నీటిని బాగా కలిపి తలకు పట్టించి తర్వాత బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి కనీసం వారానికి రెండుసార్లు ఈ విధంగా తలస్నానం
చేయడం వలన తలలో పేర్కొన్న దుమ్ము, జిడ్డు, చెమట అంతా పోయి జుట్టు షైనీగా మృదువుగా మారుతుంది. అదేవిధంగా తలలో ఉండే పేలు కూడా పోతాయి. తేనెలో ఏమోలియాంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హెయిర్ మాశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్లను మృదువుగా మారుస్తాయి. బియ్యం నీటిలో జుట్టు పెరగడానికి ఉపయోగపడే అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్లు బి,సి మరియు ఈ లతో కలిసి జుట్టు ఎదుగుదలను బాగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. తేనే మీ జుట్టు యొక్క సహజ మెరుపుని పునరుద్దించడంలో సహాయపడుతుంది. కలమందలో మీ జుట్టును బలోపేతం చేయడంలో ఉపయోగపడే అనేక క్రియాశీల పదార్థాలు అలాగే కణజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.