Nerve Weakness : నరాల వీక్ నెస్ తో బాధపడుతున్నారా.. అయితే పోపుల డబ్బా తెరవాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nerve Weakness : నరాల వీక్ నెస్ తో బాధపడుతున్నారా.. అయితే పోపుల డబ్బా తెరవాల్సిందే!

 Authored By pavan | The Telugu News | Updated on :2 March 2022,8:20 am

Nerve Weakness : మన వంటిల్లే ఆరోగ్యశాల అని చాలా మంది వైద్య నిపుణులు చెబుతుంటారు. వంటింటి చిట్కాలతో చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటింట్లోని పోపుల డబ్బాలో చాలా సమస్యలకు ఇట్టే పరిష్కారం లభిస్తుంది. అదే విధంగా.. మనం తీసుకునే ఆహారంతోనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ చెబుతారు. ఈ నిజాన్ని చాలా అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. ఇంట్లో ఉండే ధనియాలు మన శరీరంలో అనేక అనారోగ్యాలను నయం చేయడంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్, మూత్ర నాళ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. నరాల బలహీనతను కూడా అరి కడుతుందని నిరూపితమైంది. ధనియాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.ధనియాలలోని విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

మీ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే బహుళ ప్రభావాలను ధనియాలు కలిగి ఉంటాయి. ధనియాలు మూత్ర విసర్జనను సక్రమంగా సాగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది మీ సిస్టమ్ నుండి అదనపు సోడియంను ఫ్లష్ చేయడంలో సహాయ పడుతుంది. ధనియాలు తరచూ తీసుకోవడం వల్ల రక్త పోటు తగ్గుతుంది. శరీరంలో మంటను తగ్గించడంలోనూ ధనియాలు చక్కగా పని చేస్తాయి. క్యాన్సర్ నుండి గుండె జబ్బుల వరకు అనేక అనారోగ్య సమస్యలపై ధనియాలు పని చేస్తాయి. ధనియాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేయడానికి పని కొస్తాయి.కొత్తి మీర ఆకులు మరియు గింజలు విటమిన్-కె తో నిండి ఉంటాయి.కొత్తి మీర ఆకులు రక్తం గడ్డ కట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Nerve Weakness coriander leaves and seeds help very well to human body

Nerve Weakness coriander leaves and seeds help very well to human body

ఎముకలు తమను తాము రిపేర్ చేసుకోవడంలో విటమిన్-కె ఎంతో సాయం చేస్తుంది. దాంతో పాటు ఇతర ఎముకల వ్యాధులను నివారిస్తుంది. విటమిన్‌-కె గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్తి మీర ఆకులతో పాటు గింజలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తి మీరలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ ను తొలగించడంలో ఎంతో సాయం చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణాల నుంచి అపాయాన్ని తగ్గిస్తాయి కొత్తి మీర ఆకులు. ఈ ఆకులను తరచూ తీసుకుంటే… శరీరంలో వచ్చే వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తాయి. మధుమేహం ఉన్న వారిలోని రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గించేందుకు కొత్త మీర విత్తనాలు ఉపయోగపడతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది