Pumpkin Seeds : ఈ గింజలతో… మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి జాగ్రత్త… అవేంటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Pumpkin Seeds : ఈ గింజలతో... మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి జాగ్రత్త... అవేంటో తెలుసా...?
Pumpkin Seeds : విత్తనాలు శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే సహజ ఆహార పదార్ధం. ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లే దీనితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ విత్తనాలు పేరు బూడిద గుమ్మడి విత్తనాలు. దీనిలో పోషకాలు పుష్కలం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి ఎన్నో పోషకాలు దీనిలో దాగి ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే, కొన్ని చెడు ప్రభావాలు కలుగుతాయి మరి అవి ఏంటో తెలుసుకుందాం…

Pumpkin Seeds : ఈ గింజలతో… మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి జాగ్రత్త… అవేంటో తెలుసా…?
Pumpkin Seeds బూడిద గుమ్మడికాయ విత్తనాల అప్రయోజనాలు
గుమ్మడికాయ విత్తనాలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనిని తీసుకుంటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. తక్కువ మోతాదుల్లో తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఎక్కువ తింటే,కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియా లాంటివీ రావచ్చు. తనలో మంచి కొవ్వులు ఉన్న వారిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు ఎక్కువ మోదాల్లో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి, వీటిని తక్కువగా మాత్రమే తీసుకోవాలి. తిన్న తర్వాత వ్యాయామం చేయడం తప్పనిసరి. కొంతమంది, ఈ విత్తనాలను, నట్లు లాంటి వాటికి సహజంగానే అలర్జీ ఉంటుంది. ఇలాంటి బూడిద గుమ్మడి విత్తనాలు తీసుకున్నప్పుడు,గొంతు దురద, తలనొప్పి, తుమ్ములు, దగ్గు చర్మంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటివారు,తినే ముందు డాక్టర్ సలహా తీసుకొని వినియోగించడం ఉత్తమం.
బూడిద గుమ్మడికాయ విత్తనాలలో మెగ్నీషం ఎక్కువగా ఉంటుంది అందుకే హై బీపీ అన్నవారికి ఈ బూడిద గుమ్మడికాయ గింజలు మంచివీ. లోబీపీ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే కనుక రక్తపోటు మరింత తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి,ఇలాంటి వారు తీసుకునే మోతాదుపై జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లలు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కోపీచు పదార్థాలు వారికి కడుపు నొప్పిని కలిగిస్తాయి. అజీర్ణం వంటి సమస్యలు కలిగించవచ్చు. ఆగే విత్తనాలు గొంతులో ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, వీటిని నేరుగా ఇవ్వకుండా వాటిని పొడిగా చేసి పాలలో కలిపి ఇస్తే మంచిది.
విత్తనాలును వేయించి, పొడి రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. రోజుకు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.చిన్నపిల్లలకు అర స్పూన్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. వీటిని పెరుగు లాంటి ఆహారాలు కలిపి తీసుకుంటే మేలు జరుగుతుంది.బూడిద గుమ్మడికాయ విత్తనాలు చాలా పోషకాలు ఉంటాయి. వీటిని ఎక్కువ తీసుకుంటే పైన చెప్పిన లక్షణాలు వస్తాయి.పూర్తిగా మానేయడం కంటే తక్కువ మోతాదులో తీసుకుంటే దీని ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మితంగా తినడమే ఉత్తమం.