Hair Tips : మూడే మూడు వారాలు ఈ నూనె వాడితే చాలు.. జుట్టు పొడవుగా అవుతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : మూడే మూడు వారాలు ఈ నూనె వాడితే చాలు.. జుట్టు పొడవుగా అవుతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :26 May 2022,4:00 pm

Hair Tips : జుట్టు సమస్యలు తగ్గించుకునేందుకు చాలా మంది వైద్యులను సంప్రదించడం.. కొత్త కొత్త టెక్నాలజీని వాడటం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ వాటి కంటే కూడా అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు చాలా బాగా పని చేస్తుంటాయి. కానీ వాటిని తయారు చేయడానికి పట్టణాల్లో ఉండే వారికి అన్ని రకాల ఆకులు, ఔషధాలు అందుబాటులో ఉండవు. మీరు ఏవైనా అందుబాటులో ఉంటే తాజా వాటితో ఈ చిట్కాను తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చిట్కా కోసం తీసుకోవాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కొబ్బరి నూనె, మందార పువ్వు పొడి, మందార ఆకుల పొడి, కరివేపాకు, ఉసిరికాయల పొడి. ఈ పొడులన్నీ ఆన్ లైన్, సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద నూనెను పెట్టి తీసుకున్న పదార్థాలన్నీ అందులో వేసుకోవాలి.

అర కప్పు నూనెకు ఒఖ స్పూన్ చొప్పున పదార్థాలు వేసుకొని కావాల్సినంత నూనెను తయారు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను చల్లారనివ్వాలి. ఈ నూనెను వడకట్టుకొని తలకు అప్లై చేసుకొని మరుసటి రోజు తల స్నానం చేయవచ్చు. ఇందులో వాడిన పదార్థాలన్నీ పూర్వం నుంచి జుట్టు సంరక్షణలో మన పెద్దలు ఉపయోగించినవే. వీటి వలన ఎటువంటి సైట్ ఎఫైక్ట్స్ ఉండవు. ఇందులో వాడిన ఉసిరిలో విటామిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందార ఆకులు, మందార పువ్వులు, జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా దృఢంగా పెరిగేందుకు, చుండ్రు సమస్యను నివారించేందుకు సహాయ పడతాయి. తలలోని చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు మందార ఆకులు చాలా బాగా సహకరిస్తాయి.

fasr hair growthing oil with natural ingrediants

fasr hair growthing oil with natural ingrediants

కరివేపాకులోని యాంటీ ఆక్సిండెట్స్ ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. జుట్టు రాలే సమస్యను జుట్టు నల్లగా మెరిసేలా చేయడానికి చాలా బాగా సహాయ పడుతుంది. మీకు ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ అందుబాటులో ఉంటే పచ్చివి వాడుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఇవేవీ దొరకని వారు ఆన్ లైన్ లో కనుక్కొని తయారు చేసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలను పొందవచ్చు. నాచురల్ పదార్థాలు ఏమైనా ఉపయోగించినప్పుడు ఒకటి లేదా రెండు రోజుల్లో వాటి వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే బయట పడతాయి. వాటిని మానేయడం మంచిది. కానీ కెమికల్స్ తో తయారు చేసిన నూనె వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుండి బయట పడడానికి సమయం పడుతుంది. అందుకే ప్రకృతి సహజమైన పదార్థాలను జీవన విధానంలో భాగం చేసుకోవాలి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది