Health Benefits : ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే అంజీర్ పండ్లు తినాలట.. లాభాలు తెలిస్తే షాక్ అవుతారు?
Health Benefits : అంజీర్ లేదా అత్తి పండు తినడం వలన మనిషి అనారోగ్యానికి దూరంగా ఉంటాడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని, అనారోగ్యం రాకుండా ఇందులోని సుగుణాలు, విటమిన్లు, ప్రోటీన్లు సాయం చేస్తాయని చెప్పారు. శరీరం ఎల్లప్పుడూ నిత్య ఆరోగ్యంగా ఉండాలన్నా.. గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటివి దూరం అవుతాయి. ఈ పండు తింటే ఎముకలు కూడా బలంగా తయారవుతాయట..
Health Benefits : అంజీర్‌తో కలిగే లాభాలు..
అంజీర్ పండును రాత్రి నానబెట్టి తింటే ఇంకా అధిక ప్రయోజనాలు చేకూరుతాయట.. అవేంటో ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందుగా నానబెట్టిన అంజీర పండ్లను తింటే మలబద్దకం దూరం అవుతుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ రెండూ కూడా పుష్కలంగా ఉంటాయట..ఇవి ప్రేగుల కదలికను మెరుగుపరుస్తాయి.జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటుంది. అంజీర్, అత్తి పండ్లను తినడం వలన బాడీలో కాల్షియం శాతం పెరుగుతుంది. ఇది బాడీలోని ఎముకలకు చాలా అవసరం. దీంతో ఎముకలు బలంగా తయారువుతాయి. అంజీర్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.ఫైబర్ అధికంగా ఉంటుంది. డైట్ ఫాలో అయ్యేవారు అంజీర్‌ను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఈ ఫ్రూట్ బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంజీర్ పండ్లలో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.డయాబెటిక్ పేషెంట్లలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి అద్భుతమైన సంజీవని అని చెప్పొచ్చు.అంతేకాకుండా ఈ పండులో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. ఇవి తింటే మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు దూరమవుతాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం సమస్యల నుంచి బయటపడుతారు.