Health Problems : మీ చేతి గోర్లను చూసి మీ ఆరోగ్య సమస్యలు చెప్పేయొచ్చు… ఎలాగో చూడండి!
Health Problems : మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అయితే ముందుగా ఆ వైద్యుడు మన గోర్లు, కళ్లు, నాలుకను పరీక్షిస్తాడు. అయితే కేవలం అవి చూస్తేనే మన ఆరోగ్య పరిస్థితి ఆయనకు తెలిసిపోతుందా అని చాలా సార్లు మనం షాక్ అవుతుంటాం. అవును అది నిజమే. మన కళ్లు, నాలుక, ముఖ్యంగా గోర్లు చూసి కూడా మన అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. అయితే అదెలాగో మనం అప్పుడు తెలుసుకుందాం.పెళుసైన, బలహీనమైన, పొట్టు లేచినట్టు ఉండే గోర్లు సాదారణంగా చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వారి అనారోగ్య సమస్యలకు సంకేతాలే. ఆరోగ్యకరమైన గోర్లు రంగు పాలిపోకుండా, మృదువుగా, నిర్జీవంగా కనిపిస్తాయి. కానీ గోర్ల ఆకృతి, రంగులో ఏదైనా తేడా ఉన్నా.. లేక మన గోర్లు పాలిపోయినట్లు కనిపించినా అది మన అనారోగ్యానికి అడ్రెస్ ఇచ్చినట్లే. కఠినమైన గోర్లు కాస్త పెళుసుగా మారి సులభంగా పగుళ్లు ఏర్పడతాయి.
ఇవి సాదారణంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇలా గోర్లు పెళుసు బారిన సమస్యను ఒనికోస్కిజియా అని పిలుస్తారు. అయితే ఇలా ఉన్న గోర్లు తొందరగా విరిగిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆల్ఫ-హైడ్రాక్సీ ఆమ్లాలు లేదా లానోలిన్ కల్గి ఉన్న లోషన్లను గోర్ల మీద వేసి మెల్లిగా మసాజ్ చేయాలి. అయితే పెళుసు గోర్లు ఉన్న వారికి ఐరన్ లోపంతో పైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉండవచ్చు. బలహీనంగా ఉన్న గోర్లు కూడా సులభంగా విరిగిపోతాయి. గోర్లతో బలాన్ని ఉపయోగించి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు తొందరగా విరిగిపోవడం జరుగుతుంది. ఇందుకు కారణం అధికంగా తడి తగులుతూ ఉండటమే. అయితే ఇది వ్యవసాయం చేసే వారిలో మరియు నీటిలో ఎక్కువగా పని చేసే వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే మెనిక్యూర్ లాంటివి చేయించుకోవడం వల్ల కూడా గోర్లు అనారోగ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విటామిన్ బీ, కాల్షియం, ఐరన్ లేదా కొవ్వు ఆమ్లాల లోపంతో ఎక్కువగా సంబంధం కల్గి ఉంటుంది.
మల్టీ విటామిట్ తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.గోర్ల మీద పొట్టు వస్తుంటే… మీకు ఐరన్ లోపం ఉన్నట్లు లెక్క. లేదంటే గోరు బయట గాయం జరగడం.. లేదా ఏదైనాన దెబ్బ తగలడం జరిగినా ఇలా గోర్లపై ఉండే పొట్టు ఊడిపోతూ ఉంటిం. బలవర్ధకమైన ఆహార, కాయ ధాన్యాలు. ఎర్ర మాంసం, తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. గోళ్లపై చీలకలు వస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా బ్యూస్ లైన్స్ అని పిలువబడే క్షితిజ సమాంతర చీలికలు వస్తే మాత్రం తీవ్రమైన లక్షణానికి సంకేతం. ప్రస్తుతం కరోనా సోకిన వాళ్లలో కొంత మందిలో ఇవి కనిపిస్తున్నాయి. గోర్లు పసుపు రంగులోకి మారాయంటే తీవ్ర అనారోగ్యానికి సంకేతం. అలాగే నేల్ పాలిష్ ఎక్కువగా వేసుకునే వాళ్లలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయి. అయితే దీనికి చక్ పెట్టాలంటే విటామిన్ ఇ లేదా బాదానం నూనెతో గోర్లను మర్దానా చేయాలి. అంతే కాకుండా గోర్ల మీద నల్లని గీతలు గోరు లోపలి చర్మం గాయానికి గురైతే.. తెల్ల మచ్చలు వస్తే జింకో లోపాన్ని సూచిస్తాయి.