Today Horoscope : న‌వంబ‌ర్‌ 15 2021 సోమ‌వారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Horoscope : న‌వంబ‌ర్‌ 15 2021 సోమ‌వారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :14 November 2021,10:10 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు అప్పులు ఇవ్వకండి. ఆఫీస్‌లో తీవ్రమైన పని వత్తిడి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు మంచి కాలం. శ్రీసోమేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనులు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహికంగా మంచిరోజు. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి.విద్యార్థులకు మంచిరోజు. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ పరమేశ్వర పూజ చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనుల కోసం సమయం వెచ్చిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి ఇబ్బందులకు గురిచేస్తుంది. అమ్మవారి పూజ చేయండి. కర్కాటకరాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు వింటారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వస్తుంది. ధనలాభాలు వస్తాయి. వ్యాపారులకు మంచి రోజు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు. వైవాహికంగా సంతోషమైన రోజు. పసుపు గణపతిని ఆరాధించండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధవుల నుంచి సహకారం లభిస్తుంది. చాలా ప్రశాంతమైన రోజు. ఆఫీస్‌లో ఇబ్బందులు. పై అధికారుల నుంచి సమస్యలు. ఆరోగ్య సమస్యలు. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు. సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో అందరి మన్ననలు, ప్రేమ పొందుతారు. సమయం వృథా చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషమైన జీవితం. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు అనారోగ్య సూచనలు. రియల్‌ ఎస్టేట్‌ లాభాలు. ఇంట్లో సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో మంచి రోజు. పై అధికారుల నుంచి ప్రశంసలు. ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో నిరాశాజనకంగా ఉంటుంది. శ్రీశివ అభిషేకం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు విభేదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు ఎదురుకొంటారు. మీ తెలివి తేటలతో నష్టాలను లాభాలుగాద మార్చుకొంటారు. మంచిరోజు,. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రొమాంటిక్ రోజు. విద్యార్థులకు మంచి ఫలితాలు. ఆవుపాలతో శివుడిని అభిషేకించండి.

ధనస్సురాశి ఫలాలు : ఈరోజు ఏకగ్రతతో పనిచేయాల్సిన రోజు. ఈరోజు వృత్తిలో నైపుణ్యానికి పరీక్ష ఎదురవుతుంది. ధనలాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో గొడువలు. విద్యార్థులు శ్రమించి మంచి ఫలితాన్ని పొందుతారు. గోసేవ చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండండి. ధనం విషయంలో జాగరూకతతో ఉండండి. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు. శ్రీశివ పూజ చేయండి.,

కుంభరాశి ఫలాలు : ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి, ఖర్చులు పెరుగుతాయి. విందులు వినోదాలకు హాజరవుతారు. ప్రేమలో విజయం సాధిస్తారు. నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన రోజు. జీవితంలో స్పెషల్ టైం ఈరోజు. పేదలకు అన్నదానం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా నిర్వహిచండి. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అదృష్టం కలసి వస్తుంది. స్నేహితుల నుంచి లాభాలు వస్తాయి. పెండింగ్‌ పనులు పూర్తిచేయండి. ఆర్థికంగా మంచి స్తితి. గురువులను గౌరవించండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది