Zodiac Signs : మే 05 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలు. ఉద్యోగం, విద్య సంబంధ విషయాలలో అనుకూలం. చాలా కాలంగా ఉన్న పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. నవగ్రహారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కుటుబంలో సానుకూలమైన మార్పులు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఆనందం గడుపుతారు. మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
మిధునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. సాయంత్రం నుంచి అనుకూలంగా ఉంటగుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. వివాదాలకు అవకాశం ఉంది. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : శుభ వార్తా శ్రవణం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. తెలివితేటలతో ముందుకుపోతారు. ధైర్యంతో పనులు చేసినా కొంత మేర ఇబ్బంది పడుతారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి శుభదాయకమైన రోజు. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. మంచి వార్తలు వింటారు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. శుభకార్యాలకు హాజరవుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు పూర్తవుతాయి. అనుకోని వారి నుంచి స్వలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రల ద్వారా మంచి వార్తలు వింటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. పెద్దల మాట వినక పోవడం వల్ల ఈరోజు నష్టాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఏ పని పైనా శ్రద్ద పెట్టలేరు. కుటుం బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు శుభ వార్తా శ్రవణం. చింతామణి గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. అన్నదమ్ముల నుంచి సహయ సహకారం అందుతుంది. మీరు చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మంచి రోజు. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో ఈరోజు ముందుకుపోతారు. అనుకోని లాభాలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు కలసివస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి అనువైనరోజు. షేర్, ట్రేడింగ్ రంగాల వారికి శుభదినం. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : శుభ పలితాలతో ఈరోజు గడుస్తుంది. సుఖ సంతోషాలతో ఆనదంగా గడుపుతారు. అప్పులను తీరుస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల పరిచయాలుఅవుతాయి. ఇంట్లో అందరి సహకారంతో ముందుకుపోతారు. శ్రీ గురుదత్తాత్రేయ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అనుకోని వివాదాలు రావచ్చు. మితిమీరిన చేష్టల వల్ల ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. మీరు కష్టపడ్డ దానికి ఫలితం రాదు. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.,