Inspirational : 56 ఏళ్ల వయసులో బుల్లెట్ పై దేశమంతా తిరుగుతూ… సత్తా చాటుతున్న మహిళ
Inspirational : మగరాయుడిలా బండి నడుపుతావా అని ఒకరు.. అమ్మాయిలంటే ఇలానే ఉండాలని పాత సామెతలు చెప్పేవాళ్లు మరొకరు. తరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ భావనలకి చెక్ పెట్టాలనుకున్నారు. మిని ఆగస్టిన్. ఇందుకోసం అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకున్న బైక్ రేసింగ్‌లో అడుగుపెట్టారు. దిల్లీ నుంచి లెహ్ వరకు 24000 కిలో మీటర్లు కేవలం 18 రోజుల్లో బైక్ రైడ్ చేసి వాహ్వా అనిపించారు మిని.’కేరళలో పుట్టి, కోయంబత్తూర్‌లో పెరిగిన నేను సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. నేను సైకిల్ నడిపినా ఆశ్చర్యంగా చూసేవారు. నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులతో విసిగిపోయాను. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సాంప్రదాయ మూస పద్ధతులను ధిక్కరించడం నాకు అలవాటుగా మారింది.
నేను బైకింగ్లో గ్రాడ్యుయేట్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోసం నేను సృష్టించుకుంటున్న చిన్న మైలురాళ్లతో నేను సంతోషంగా ఉన్నాను.’- మిని1994లో మినీ చెన్నైకి వెళ్లి అక్కడ కెనరా బ్యాంక్‌లో పని చేశారు. ఇక్కడే ఆమె భర్త [బిజు పాల్] 350-సీసీ బైక్‌ని కొనుగోలు చేసి.. మినీని నడపాలనుకుంటున్నావా అని అడిగారు. “ఇది చాలా బరువుగా ఉందని, నేను డ్రైవ్ చేయలేను” అని మిని చెప్పారు. ‘నేను దానిని నడపమన్నాను, మోయమనలేదని మిని భర్త అన్నారు. అదే తనకు ప్రేరణ అని మిని అంటున్నారు.దిల్లీ నుంచి లేహ్ వరకు 18 రోజుల రైడింగ్‌లో.. ఆమె పూర్తి చేసిన 2,400 కిమీ రైడ్ మినీ జీవితాన్ని మార్చేసింది.
‘మైళ్ల దూరంలో కూర్చొని, నన్ను ముందుకు సాగేలా ప్రేరేపించిన నా భర్తకు నేను చాలా క్రెడిట్ ఇస్తాను. లేహ్ లో నాకు కష్టంగా అనిపించింద. ఎత్తు ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను.56 ఏళ్ల వయస్సులోనూ బైక్ రైడ్ చేయడానికి మినీ తన వయసు అడ్డుగా అనుకోవడం లేదూ.. ఇప్పటికీ రైడ్ “వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే..నేను రైడ్ చేయలేని రోజు నాకు వృద్ధాప్యం అవుతుంది” అని ఆమె అంటుంది. తన పిల్లలు కెవిన్, ఆన్ ఎలిజబెత్‌లకు రోల్ మోడల్. తన కుటుంబ సభ్యులు తన ప్రయాణాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నారని మినీ అంటున్నారు.