SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు..!

SSC Jobs  : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission (SSC) 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1340 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇతర సాంకేతిక ఉద్యోగాల సరసన ఉన్న గౌరవప్రదమైన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ లింక్ ద్వారా అప్లై చేయవచ్చు.

SSC Jobs బీఈ బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు

SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు..!

SSC Jobs  ఆల‌స్యం చేయ‌కండి..

ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జూలై 1, 2025 కాగా, రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 21, 2025.
ఈ నోటిఫికేషన్ కింద సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీటెక్ (B.Tech) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.ఎలా దరఖాస్తు చేయాలి అంటే ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్తారు ( https://ssc.gov.in లేదా సంబంధిత అధికారిక లింక్).

“JE Recruitment 2025” నోటిఫికేషన్ సెక్షన్‌కి వెళ్లి, అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.అవసరమైన సమాచారం నింపి, స్కాన్ చేసిన పత్రాలను అటాచ్ చేసి ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ పోస్ట్‌కి ఎంపికైన అభ్య‌ర్ధుల‌కి జీతం 35 వేల నుండి ల‌క్ష వ‌రకు వ‌స్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ 2025 ప్రకారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది